హైదరాబాద్ మదరసా లో ఘోరం

child abuse in madarasa

మదరసాల్లో నిర్వహకుల ఆకృత్యాలు కొనసాగుతున్నాయి. మత పరమైన సంస్థలు కావడంతో చాలా విషయాలు బయటకు రావడం లేదు. అయితే కొన్ని సంఘటనల్లో మాత్రం బాధితులు బయటకు వస్తున్నారు. హైదరాబాద్ లోని గోల్కొండలో ఉన్న మదరసాలో శుక్రవారం జరిగిన సంఘటన కలకలం రేపింది. మదరసా బోధకుడు 12 సంవత్సరాల బాలుడిపై లైంగిక దాడికి దిగాడు. బాలుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసింది.

గోల్కొండ లోని ఓ మదరసాలో బంజారీ దర్వాజ ప్రాంతానికి చెందిన 12 సంవత్సరాల బాలుడు చదువుకుంటున్నాడు. బాలుడితో కలిపి మొత్తం 10 మంది చిన్నారులు అందులో ఉంటున్నారు. వీరు శుక్రవారం రాత్రి పడుకున్న తరువాత మదరసా బోధకుడు మహ్మద్ షీర్ ఖాన్ ఒక అబ్బాయి పై లైంగిక దాడి చేశాడు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ విషయాన్ని బాలుడు గుర్తించాడు. ఉదయాన్నే బాలుడు తన బందువులకు విషయాన్ని చెప్పడంతో వారు గోల్కొండ పోలీసులను ఆశ్రయించారు. షీర ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఎవరెవరిపై ఇలాంటి దాడికి పాల్పడ్డాడు అన్న విషయాలను తెలుపుకునే పనిలో ఉన్నారు.


Other News