గ్రూప్ 2 పరీక్షలో జస్ట్ 40 వేల మందే వైట్నర్ వాడారు… బరితెగించిన టీఎస్పీఎస్సీ

tspsc

 

గ్రూప్ 2 పరీక్షల్లో అవకతవకలను కప్పి పుచ్చే ప్రయత్నం.

వెయ్యి ఉద్యోగాల కోసం జరిగిన పరీక్షలో 40 వేల జవాబు పత్రాలు ఫ్రాడ్ ?

ఇదంతా చిన్న విషయమే అంటున్న టీఎస్సీఎస్సీ…

టీఎస్పీఎస్సీ అసమర్ధతా … ? అక్రమాలు జరిగాయా … ?

 

గ్రూప్ 2 ఉద్యోగాల నియామకాల కోసం జరిగిన అవకతవకలను టీఎస్పీఎస్సీ ఇంకా సమర్ధించుకునేందుకు ప్రయత్నిస్తోంది. కళ్లు మూసుకొని పాలుతాగుతున్న చందంగా వ్యవహరిస్తోంది. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చలగాటమాడుతోంది. ఇప్పుడు ఏకంగా తాము చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు బరితెగించి . కేవలం 40 వేల జవాబు పత్రాలపైన మాత్రమే వైట్నర్ వాడారని చెప్పుకుంటుంది. ఆ పేపర్లను మానవతా దృక్పధంతో అనుమతించామని చెప్పుకుంటోంది. ఐదు లక్షల మంది పరీక్షలు రాస్తే అందులో 40 వేల మంది జవాబు పత్రాలపై వైట్నర్ పెట్టి వివరాలు సరి చేశారు. ఇంత పెద్ద వ్యవహరాన్ని టీఎస్పీఎస్సీ చాల చిన్న విషయం గా చెప్పుకునే ప్రతయ్నం చేస్తోంది.

వెయ్యి ఉద్యోగాల నియామకం కోసం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యప్తంగా దాదాపు 8.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.  ఇందులో ఐదున్నర లక్షల మంది మాత్రమే పరీక్షలకు హాజరైయ్యారు. అయితే దాదాపు 40 వేల జవాబు పత్రాలపై అనుమానాలు ఉన్నాయి. వీటన్నింటి పై వైట్నర్ పూసి అభ్యర్థి వివరాలు మార్చేశారు. ప్రొఫేషనల్ పరీక్షలో వైట్నర్ తో వివరాలు మార్చిన జవాబు పత్రాలు ఎలా అనుమతిస్తారు. అసలు ఒకరి పత్రాలు మరొకరికి ఎందుకు ఇచ్చారు. దీనికి కారలకులు ఎవరు. లక్షల మంది జీవితాలతో చలగాటం ఎందుకు అడుతున్నారు అన్న అంశాలకు వివరణ ఇవ్వకుండా టీఎస్సీఎస్సీ తమ తప్పులను కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. మానవతా దృక్పదంతో ఆ పత్రాలను కూడా అనుతించామని చెప్పుకుంటోంది.

ఇటువంటి వితండ వాదనలతోనే టీఎస్పీఎస్సీ నవ్వుల పాలౌతోంది. ఇప్పటికే హై కోర్టు ఈ మొత్తం వ్యవహహారం పై సీరియస్ గా ఉంది. ఈ మెత్తం ఎపిసోడ్ లో పరీక్షలు సరిగ్గా నిర్వహించే సమర్ధత టీఎస్పీఎస్పీకి లేదా .. ? లేక అక్రమాలు జరిగాయా అన్న విషయం కూడా తేలాల్సి ఉంది.


Other News