ఆ ఒక్కటి తప్ప… హోంగార్డులకు అన్ని ఇస్తానంటున్న సీఎం

KCR with home gaurds

రాష్ట్ర చరిత్రలో హోంగార్డులు మరచిపోలేని రోజు ఇది. కనీ వినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ వారిపై వరాల జల్లు కురిపించారు. రాష్ట్ర వ్యప్తంగా ఉన్న 18 వేల మందికి తీపి కబురులు ఎన్నో చెప్పారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ తప్ప మిగతా అన్ని చేస్తానని సీఎం ప్రకటించారు. బుదవారం రాష్ట్ర వ్యప్తంగా ఉన్న హోంగార్డుల ప్రతినిధులతో సీఎం ప్రగతి భవన్ లో సమావేశం అయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్న కేసీఆర్ వారికి తగిన విధంగా ఆధుకుంటామని హామీ ఇచ్చారు.

సీఎం ఇచ్చిన హమీల్లో ప్రధానంగా చూసుకుంటే హోంగార్డుల జీతాలు 12 వేల రూపాయల నుంచి ఏకంగా 20 వేల రూపాయలకు పెంచేశారు. అదే విధంగా ప్రతి సంత్సరం వెయ్యి రూపాయలు పెంచుతానని హామీ ఇచ్చారు. దీని తోడు వారికి కోరుకున్న జిల్లాల్లో డబుల్ బెడ్ రూం ఇంటిని కేటాఇస్తామని ప్రకటించారు. కావలసిన జిల్లాను ఎంచుకునే అవకాశాన్ని వారికే ఇచ్చేశారు. మరో ప్రధాన విషయం చూసుకుంటే పోలీసు హస్పిటల్స్ లో ఉచిత వైద్యం అందించడంతో పాటు ప్రైవేటు మెడికల్ ఇన్స్యూరెన్స్ ఇప్పించడానికి నిర్ణయించారు. మహిళా హోంగార్డులకు 6 నెలల మెటర్నిటీ సెలవును , పురుషులకు 15 రోజుల పెటర్నిటీ సెలవులను ప్రకటించారు. కానిస్టేబుల్ నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు భారీ ఎత్తున పెంచారు.

  1. జీతం 12 వేల నుంచి 20 వేలకు పెంపు.
  2. ఇక ముందు ప్రతి సంవత్సరం వెయ్యిరూపాయల జీతం పెంపు.
  3. హోంగార్డు కోరుకున్న జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.
  4. ఫ్యామిలీకి మెడికల్ ఇన్స్యూరెన్స్ , పోలీసు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం.
  5. మహిళా హోంగార్డులకు 6నెలల మెటర్నిటీ లీవ్ , పురుషులకు 15 రోజుల పెటర్నిటీ లీవ్
  6. కానిస్టేబుళ్లతో సమానంగా డైట్ చార్జీలు , యూనిఫాం.
  7. కానిస్టేబుళ్ నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు

ఇన్ని హామీలు ఇచ్చిన సీఎం కేసీఆర్ హోంగార్డుల ఉద్యోగ క్రమబద్ధీకరణ విషయంలో మాత్రం హామీ ఇవ్వలేదు. రోస్టర్ విధానం పాటించని ఉద్యోగ నియామకాలు క్రమబద్ధీకరిండాన్ని సుప్రీం కోర్టు తప్పు పడుతున్న నేపథ్యంలో దీనిపై మరింత అధ్యాయనం జరగాల్సిన అవసరం ఉందని ఆయన ప్రకటించారు. మరి ఈ వరాలకు హోంగార్డులు సంతృప్తి చెందుతారా …?


Other News