బతుకమ్మ ఆటల్లో అగ్రవర్ణ మహిళలు … అసలైన వారికి అందకుండా పోయిన పువ్వులు

 

 

బతుకమ్మ అసలు సిసలైన బడుగుల పండుగ. కాయా , కష్టం చేసుకునే మహిళలు సంత్సరానికి ఒక్కసారి,  సాయంత్రం వేళల్లో పువ్వులు తెంపుకొని వచ్చి చేసుకునే సంబరం. ఆడ పిల్లలు ఆడిపాడితే అన్న, తమ్ముల్లు ఆ బతుకమ్మలను చెరువు దాకా మోసుకొచ్చేది.  తెలంగాణలోని దళిత , బహుజనులు ఇళ్ళలో తరతరాలుగా జరుపుకునే అతిపెద్దపండుగ ఇది.

ఇప్పుడు బతుకమ్మ రూపు రేఖలు మారిపోయాయి. గత కొన్ని సంత్సరాలుగా భారీ మార్పు కొనిపిస్తోంది. తెలంగాణ వచ్చిన తరువాత అది మరింత పెరిగింది. బతుకమ్మను ఎప్పుడు కనీసం పండుగగా కూడా చూడనోళ్లు ఇప్పుడు సంబరాల్లో  బాగమైతున్నరు. దళిత , బహుజన అమ్మలు , అక్కా చెల్లేళ్లు బతుకమ్మలాడుతుంటే కాలుమీద కాలేసుకొని దొరసానులు , పంతులమ్మలు కూర్చొని చూసేవారు.  కాని ఇప్పుడు వారు కూడా దళిత , బహుజన మహిళలతో పాటు నడుమొంచి చప్పట్లు కొడుతూ… ఆటలాడుతున్నారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలకు పరిమితం అయిన బతుకమ్మ పండుగ ఇప్పుడు అంతర్జతీయం అయింది. అంతా బాగానే ఉన్నా. అగ్రవర్ణ మహిళలు కూడా ఇప్పుడు బతుకమ్మ చెయ్యడం , అటలాడుతుండడంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. ఊళ్లో చెరువు పక్కన ఫ్రీగా దొరికిన పువ్వులు ఇప్పుడు మార్కెట్లో కొందామంటే కూడా కనిపించడంలేదు. తంగేడు , గునుగు పువ్వు ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి.

మొత్తంగా బడుగుల పండుగలో కూడా అందరూ భాగం అవతున్నారని సంబర పడాలా … ? అసలైన దళిత , బహుజన మహిళలకు పువ్వులు దొరక్కుండా పోతున్నాయని బాధపడాలా .. ?


Other News