బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ కు రెమ్యూనరేషన్ ఎంతో తెలిసిపోయింది…

Bigg boss

బిగ్ బాస్ షోలో పార్టిసిపెట్ చేస్తున్న వారికి ఆ సంస్థ ఎంత పే చేస్తోంది… ? అందరికీ ఒకే రకంగా ఇస్తారా ..? లేదా …? మరి చెల్లింపుల్లో తేడాలు ఉంటే ఎవరికి ఎంతా అన్న విషయాన్ని ఎలా నిర్ణయించారు… ? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు తెలుగు ప్రేక్షకులను వేదిస్తున్నాయి. అయితే ఈ ప్రశ్నలకు దాదాపు సమాదానం దొరికి పోయింది. ఇంత వరకు ఈ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ … అందుతున్న సమాచారం ప్రకారం పేమెంట్ విషయంలో భారీ వ్యత్యాసాలే ఉన్నాయి. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హైలైట్ అనే చెప్పాలి ఆయనకు తప్ప మరెవ్వరికీ పెద్దగా రెమ్యూనరేషన్ ఇవ్వట్లేదట. జూనియర్ ఎన్టీఆర్ కు మొత్తం కార్యక్రమం అయిపోయే వరకు ప్రతి శని , ఆది వారాలు రావడం కోసం 8 కోట్లు ఇస్తున్నట్లు సమాచారం. అయితే పార్టీసిపెంట్స్ గా ఉన్నవారికి మాత్రం అంతంత మాత్రమే అంటున్నారు. రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో టాప్ లో ఉన్నది సంపూర్ణేష్ బాబే ( సంపూ ) . అతని తర్వాతే ఇంకెవరైనా అన్నట్లు కనిపిస్తోంది. మిగతా వారి విషయంలో ఎలా ఉన్నా యువ నటుడు ప్రిన్స్ కు అతి తక్కువ మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే షో మొత్తం 70 రోజులు నడవాల్సి ఉన్నప్పటికీ అందరూ 70 రోజులు ఉండే అవకాశం లేదు. అందుకు బిగ్ బాస్ షోలో ఉంటున్న వారందరికీ వారం రోజులకు చెల్లింపులు నిర్ణయించారు.  వారి వివరాలు ఒక సారి చూసుకుంటే …

సంపూర్ణేశ్ బాబు                                          10 లక్షలు

సీనియర్ నటుడు సమీర్                           7.5 లక్షలు

ముమైత్ ఖాన్                                               7.5 లక్షలు

శివ బాలాజీ                                                   7.5 లక్షలు

ఆదర్శ్                                                          7.5 లక్షలు

టీవీ ఆర్టీస్ట్ , కమీడియన్ ధన్ రాజ్          7.5 లక్షలు

నటీ అర్చన                                                 5 లక్షలు

తెలంగాణ గాయని మధు ప్రియ               5 లక్షలు

గాయని కల్పన                                            5 లక్షలు

తెలంగాణ ఫేమ్ యాంకర్ కత్తి కార్తిక        5 లక్షలు

సీరియల్ నటి హరితేజ                              5 లక్షలు

నటి జ్యోతి                                                     4 లక్షలు

సనీ విశ్లేషకుడు మహేశ్ కత్తి                      3 లక్షలు

నటుడు ప్రిన్స్                                             2 లక్షలు

అయితే కార్యక్రమ నిర్వహకులు వీరందరితో అగ్రిమెంట్లు తీసుకున్నారు. ఒకరి విషయం మరొకరికి తెలియకుండా అగ్రిమెంట్లు చేశారు. అయితే షోకు వస్తున్న ఆధరణ చూసి అవసరం అనుకుంటే మొత్తాన్ని పెంచే అవకాశం ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్రేక్షకుల నుంచి వచ్చే ఓటింగ్ ఆధారంగా కూడా రెమ్యూనరేషన్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా హిందీ , తమిళ భాషలతో పోల్చితే తెలుగులో పార్టిసిపెంట్స్ కు చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారన్నది టాక్.

 


Other News