ఉత్తరాది కావరం …  దక్షిణాది ప్రజలపై జాత్యాహంకార వ్యాఖ్యలు చేసిన బీజేపి నేత ….

 

Tarun vijay

 

ఉత్తరాది .. దక్షిణాది రాష్ట్రాల మధ్య ఇప్పటికే అనేక వివాదాలు ఉన్నాయి. తరతరాలుగా దక్షిణాది పై వివక్ష కొనసాగుతోంది. దీనిపై జాతీయ స్థాయిలో అనేక సందర్భాల్లో దక్షిణాది నేతలు తమ నిరసన తెలుపుతూనే వచ్చారు. ఇప్పుడు తాజాగా బీజేపి నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లైంది. ఉత్తరాది నేత కావరం ఎలా ఉంటుందో బయట పెట్టింది. ఏకంగా దక్షిణాది ప్రజలపై ఆ మాజీ ఎంపీ జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారు.

 

అసలు విషయం ఎందంటే ఇటీవల కాలంలో డిల్లీలో నైజీరియన్ల పై దాడులు జరిగాయి. ప్రధానంగా అక్కడ మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నరన్న ఆరోపణతో కొందరు స్థానికులు ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారు. వాటిని సమర్ధంగా నియంత్రించలేక పోయింది అక్కడి యంత్రాంగం. ఈ అంశాన్ని అంతర్జాతీయ మీడియా జాత్యాహంకార దాడులంటూ ప్రచారం చేస్తోంది. అందులో భాగంగా ఆల్ – జజీరా చానల్ లైవ్ చర్చ పెట్టింది. ఆ చర్చా కార్యక్రమంలో ఉత్తరాఖండ్ కు చెందిన బీజేపి నేత , రాజ్యసభ మాజీ సభ్యుడు తరుణ్ విజయ్ పాల్గొన్నారు. ఇక్కడ జాత్యాహంకార దాడులు జరగడం లేదు అని చెప్పడానికి నానా తంటాలు పడ్డాడు . ఉదాహరణ చెబుతూ దక్షిణ భారత దేశంలో ప్రజలు కూడా నల్లగా ఉంటారు. వారితో ఉంటున్నామంటే మాకు జాత్యాహంకారం లేదన్నట్లే కదా అంటూ పిచ్చి లాజిక్ తీసుకొచ్చారు. నల్లగా ఉండే దక్షణ భారత దేశ ప్రజలతో ఉండడమే కాదు మేము నల్లగా ఉండే దేవుళ్లను కూడా పూజిస్తామని చెప్పుకుంటూ తన పైత్యాన్నంతా వెల్లగక్కాడు.

 

ఎవరి ఎజెండాలో వారు బీజీగా ఉన్న తెలుగు చానల్స్ ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే నెటిజన్లు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవడంతో ఆ మాజీ ఎంపీ దిగొచ్చాడు. తన కామెంట్స్ కు క్షమాపణ చెప్పడు.


Other News