డిల్లీలో ఫైదా లేదని…  ట్విట్టర్లో కేటీఆర్ ను సతాయిస్తుండు …

KTR twitter on Diggy

 

జాతీయ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కాంగ్రేస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. 68 సంవత్సరాల వయస్సులో 44 సంవత్సరాల జర్నలీస్ట్ ను పెళ్లి చేసుకుంటాడు. కేంద్రం ఏది చేసినా ప్రచారం కోసం దాన్ని వ్యతిరేకిస్తాడు. చివరకు పాకిస్థాన్ కు అనుకూలంగా కామెంట్స్ చేస్తాడు. టెర్రరీస్టు కార్యకలాపాల్లో ముస్లీంలు పట్టుపడితే వారిని కాపాడేందుకు హిందువుల్లో కూడా టెర్రరీస్టులు ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. ఇది ఆయన నైజం. అటువంటి రాజకీయ నాయకుడు డిగ్గీ రాజా. మరి కేంద్రంలో తన మాటలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదని అనుకున్నాడో ఏంటో కాని ఈ మద్య తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాడు. ఇటీవలి కాలంలోనే ఒక వివాదాస్పద ఆరోపణ చేసి ఇప్పటి వరకు ఆధారాలు చూపని డిగ్గీ ఇప్పుడు మరో సారి తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణ చేశాడు.

తెలంగాణలో డ్రగ్స్ కలకలం రేగుతున్న విషయం అందరికీ తెలిసిందే. పాఠశాల విద్యార్థులు కూడా వినియోగిస్తున్నారన్న వార్తలు ఆందరినీ కలవర పెడుతున్నాయి. ఇప్పటికే ఈ డ్రగ్స్ ముఠాతో సంబందాలు ఉన్నాయని భావిస్తున్న సిని రంగ ప్రముఖుల విచారణ జరుగుతోంది. ఈ టైంలో దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు. డ్రగ్స్ కేసుల్లో టీఆర్ఎస్ లోని కేటీఆర్ సన్నిహితులు ఉన్నారంటూ టీట్ చేశాడు. మరి విచారణ నిజాయితీగా జరుగుతుందా లేదా చూడాలంటూ అనుమానం కూడా వ్యక్తం చేశాడు. ఇదంతా ట్వీట్టర్ వేధికగా కావడంతో కేటీఆర్ కు తలనొప్పిగా మారింది. దీంతో కేటీఆర్ కు స్పందించక తప్పలేదు. డిగ్గీ కి గట్టిగానే రిప్లే ఇచ్చారు కేటీఆర్. ఆయన తన వయస్సు పై బడిన నేపథ్యంలో రాజకీయానల నుంచి తప్పుకొని , వయస్సుకు అనుగుణంగా పనులు చేసుకుంటే బెటర్ అని సలహా ఇచ్చారు.

గతంలో కూడా దిగ్విజయ్ సింగ్ తెలంగాణ ప్రభుత్వం మీద తీవ్రమైన ఆరోపణ చేశారు. ఉగ్రవాదులను పట్టుకోడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఉగ్రవాదాన్ని పెంచుతున్నాయని ఆరోపించారు. దానికి సంబందించి ఆధారాలు మాత్రం ఇంత వరకు బయట పెట్టలేదు. అయితే డిగ్గీ చేసిన ఆరోపణలపై కేసులు పెడ్తామన్న ప్రభుత్వం కూడా తరువాత ఆ విషయాన్ని మరచిపోయింది. ఏది ఏమైనా డిగ్గీ చేసే ఆరోపణల విషయంలో తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. లేదంటే అనుమానాలు పెరిగే ప్రమాధం ఉంది.


Other News