టీఆర్ఎస్ పాలనపై ఆరోపణలు చేస్తే ఇక కేసులే…

 

TRS plenary

ప్రతిపక్షాలు అన్నాక ఆరోపణలు చేస్తాయి… అవి నిజమైతే సరిదిద్దుకోవడం , అబద్దం అయితే కాదు అని నిరూపించాల్సిన అవసరం అధికార పార్టీ పై ఉంటుంది. ఎందుకంటే యంత్రాంగం మొత్తం అధికార పార్టీ చేతుల్లో ఉంటుంది. కాని ఇక తెలంగాణాలో అవన్ని జాన్తేనై అంటున్నారు కేసీఆర్. ఆరోపణలు చేస్తే ఇక కేసులే అని విపక్షాలకు వార్నింగ్ ఇస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ పండుగ ప్లీనరీ సాక్షిగా అపోజిషన్ కు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ లోని కొంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీ అట్టహాసంగా జరిగింది. మరోసారి కేసీఆర్ ను అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. సీనియర్లకు మాట్లాడే అవకాశం లేకుండానే మీటింగ్ సాగింది. పలువురు నేతలు తీర్మాణాలు ప్రవేశపెట్టారు. వాటికి సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్బంగా మాట్లాడిన కేసీఆర్ రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నామని ప్రకటించారు. అటువంటి తమ ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎవరైన ఆరోపణలు చేస్తే వెంటనే కేసులు పెట్టించాలని సభా వేధిక సాక్షిగా ఆయన మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే గతంలో కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలు మాత్రం మరచినట్లున్నారు. ఏది ఏమైన ఇటువంటి ప్రకటనల వల్ల అందరికీ భాద్యత పెరుగుతుంది. ప్రతిపక్షం ఆరోపణలు చేసేముందు ఒకటి కి రెండు సార్లు చూసుకుంటుంది. ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా అంతే భాద్యతగా స్పందించాల్సి వస్తుంది ఎందుకంటే ఎలాగో కేసు పెడ్తామన్నారు కద . నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతామని సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ విత్తనాల వల్ల రైతులు నష్టపోతే దాన్ని విత్తన కంపనీలే భరించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దీనికోసం త్వరలో కొత్త చట్టం తీసుకొస్తామని కేసీఆర్ వివరించారు.

 


Other News