“గాలి” పోయింది… బాబు బ్యాచ్ కు సరెండర్ అయిన మైనింగ్ డాన్ ? సంచలన విషయాల వెల్లడి.

 

gali

వైఎస్ టైంలో కర్నాటక , ఏపి రెండు రాష్ట్రాల్లో వెలిగి పోయిన వ్యక్తి గాలి జనార్ధన్ రెడ్డి. ఐరన్ ఓర్ వ్యాపారంలో వేలకోట్లు సంపాధించి ఒక స్థాయిలో ప్రభుత్వాలనే శాసించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి మైనింగ్ లీజ్ తీసుకొని తరువాతి క్రమంలో బాబుకే చమటలు పట్టించారు.  టైం బ్యాడ్ కావడంతో 2011లో జైలు పాలైయ్యారు. మరి ఇప్పుడెక్కడ ఉన్నారు … ఏమనుకుంటున్నాడు…

దాదాపు మూడున్నర సంత్సరాల జైలు జీవితం గాలి జనార్ధన్ రెడ్డిలో చాలా మార్పు తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. అప్పటి ఆవేశం , కోపం ఇప్పుడు ఆయనలో కనిపించడంలేదు. కారణాలు ఏమున్నా , ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్గానికి ఆయన పూర్తిగా సరెండర్ అయినట్లు కనిపిస్తోంది. గతంలో చంద్రబాబును కొజ్జా అని సంబోధించిన వ్యక్తి ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేశారు. అంతే కాదు వైఎస్ తో తనకు వ్యాపారికి సీఎంకి మధ్య ఉన్న సంబందాలే ఉండేవంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఇప్పుడు జగన్ కు మద్దతు ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పేశారు. అన్నింటికీ మించి ఏపీ రాజకీయాల్లో తాను తలదూర్చనని కుండబద్దలు కొట్టారు. ఇదంతా చెప్పింది ఎక్కడో కాదు ఏబిఎన్ ఇంటర్వూలో.

పనిలో పనిగా గాలి జనార్ధన్ రెడ్డి తనని తాను భక్త రామదాసుతో పోల్చుకున్నారు. రాముడికి ఆభరణాలు చేయించి రామదాసు 12 సంవత్సరాలు జైలులో ఉంటే తాను వెంకటేశ్వర స్వామికి కిరీటం చేయించి మూడున్నర సంవత్సరాలు జైలులో ఉన్నానని చెప్పుకొచ్చారు.

గాలి జనార్ధన్ రెడ్డి తన కూతురు పెళ్లి ఖర్చులను కూడా చెప్పేశారు. మీడియాలో ప్రచారం అయినట్లుగా తాన కూతురు పెళ్లికి 500 కోట్లు ఖర్చు పెట్టలేదని వివరించారు. కేవలం 30 కోట్లే ఖర్చు చేశానన్నారు. దానికి సంబందించిన లెక్కలన్ని ఐటి విభాగానికి ఇచ్చానని స్పష్టం చేశారు.

తన ఇంట్లో బంగారు కుర్చీ , బంగారు పల్లాలు దొరికాయంటూ వచ్చిన వార్తలపై కూడా ఆయన స్పందించారు. అవన్ని బూటకమని వివరించారు.

జనార్ధన్ రెడ్డి జైలులో దాదాపు మూడున్నర సంవత్సరాలు ఉన్నారు. మరి ఆ టైంలో ఆయన ఏమి చేశారు. ఏమి లేదు రామాయణ , మహాభారతాలు చదువుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

గాలి జనార్ధన్ రెడ్డి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఆయన చెప్పిన మాటల్లో … ఆయన ఓ కానిస్టేబుల్ కొడుకు. రాష్ట్రాల పునర్వభజన జరుగున్న టైంలో ఆయన బల్లారి ప్రాంతాన్ని ఎంచుకున్నారు. కుటుంభమంతా అక్కడే సెట్ అయ్యారు. జనార్ధన్ రెడ్డి కన్నడలోనే విధ్యాభ్యాసం చేశారు. తరువాత అక్కడే ఒక ఫైనాన్స్ సంస్థను స్థాపించారు. ఐరన్ ఓర్ కు పెద్దగా డిమాండ్ లేని సమయంలో అంటే 2000 సంవత్సరంలో ఓబుళాపురం లీజు తీసుకున్నారు. 2002 సంవత్సరంలో అనుమతులన్నీ వచ్చేశాయి. ఇదంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు. తరువాత 2004 సంవత్సరం ప్రారంభంలో ఐరన్ ఓర్ కు బాగా డిమాండ్ పెరిగింది. దీంతో వేల కోట్ల రూపాయలు గాలి గూటికి చేరాయి. తరువాత చరిత్రంతా తెలిసిందే . 2009లో మైనింగ్ అక్రమాలపై కేసు నమోదు కావడం , 2011 లో అరెస్ట్ కావడం జైలుకు పోవడం.

మొత్తంగా మూడున్నరేళ్ల జైలు జీవితం గాలి జనార్ధన్ రెడ్డిని పూర్తిగా మార్చేసింది. బాబు బ్యాచ్ కు పూర్తిగా సరెండర్ అయపోయారు. గతంలో వారి గురించి చేసిన కామెంట్స్ కు విచారం కూడా వ్యక్తం చేశారు. బీజేపీలో కొనసాగుతానని చెబుతూనే కర్నాటక రాష్ట్రానికే పరిమితం అవతాంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటానని బాబు బ్యాచ్ కు హామీ ఇచ్చేశారు.


Other News