రెచ్చిపోతే చచ్చిపోతారు … ప్రతిపక్షాలకు దమ్కీ ఇచ్చిన హోం మంత్రి

Dharna

 

ఆయన ఓ సీనియర్ రాజకీయ నాయకుడు.. కర్మిక నాయకుడు… రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు … ప్రస్తుతం రాష్ట్ర పోలీసు మంత్రి కాని అన్నీ మరచి పోయాడు. వీధి రౌడీ అవతారం ఎత్తాడు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలపై ఊగిపోయాడు. రెచ్చిపోతే చచ్చిపోతారంటూ వార్నింగ్ ఇచ్చాడు.  ఆయనే హోం మినిష్టర్ నాయిని నరసింహారెడ్డి. ధర్నా చౌక్ కొనసాగించాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీలు సోమవారం ఆందోళన చేశాయి. జేఏసీతో పాటు కాంగ్రేస్ , బీజేపీ , వామపక్షపార్టీలు , ప్రజా సంఘాలు ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. ఈ ఆందొళనను అడ్డుకునేందుకు కొందరు అధికార పార్టీ నేతలు విఫల ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాలు ధర్నా చౌక్ చేరుకునే సమయానికి వారిని వ్యతిరేకిస్తూ స్థానికుల పేరుతో కొందరు రావడంతో రెండు వర్గాల మద్య వివాధం నెలకొంది. పరస్పర దాడులు జరిగాయి. దీంతో రెండు వర్గాల్లో వ్యక్తులు గాయపడ్డారు. పోలీసులు లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తమ పిలుపును అందుకొని తరలి వచ్చిన ప్రజలకు జేఏసీ దన్యవాదాలు తెలిపింది. దీనిపై స్పందించిన అధికార పార్టీ ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని అభిప్రాయపడింది. హోంమంత్రి మరో అడుగు ముందుకు వేసి ప్రతిపక్ష పార్టీల నేతలు రెచ్చిపోతున్నారని , వారు రెచ్చిపోతే చచ్చిపోతారని హెచ్చరించారు.


Other News