టెలికాం రంగంలో జియో మరో సంచలనం… స్మార్ట్ ఫోన్ కూడా ఫ్రీ…

 

Jio phone free

టెలికాం రంగంలో ఇప్పటికే అనేక సంచలనాలు సృష్టించిన జియో ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేసింది. ఇప్పటి వరకు టెలికాం ఆపరేటర్లకు షాక్ ఇస్తూ వచ్చిన జియో ఇప్పుడు టెలిఫోన్ తయారీ దారులకు స్ట్రోక్ ఇచ్చింది. స్మార్ట్ ఫోన్ అనగానే రూపాయలకు పదివేల దగ్గర ఉంటుందని భావించే రోజుల్లో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉచితంగానే ఇవ్వనున్నట్లు ప్రకటన చేసింది. శుక్రవారం జరిగిన వాటాదారుల సమావేశంలో ముఖేష్ అంబానీ ఈ ప్రకటన చేశారు. ఇప్పటి వరకు దేశంలో 78 కోట్ల మంది ఫోన్లు వినియోగిస్తుంటే అందులో దాదాపు 50 కోట్ల మంది బేసిక్ ఫోన్లకే పరిమితం అయ్యారని ప్రకటించిన అంబానీ వారి కోసం సరికొత్త ఫోన్ మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. జియో ఫోన్ పేరుతో రాబోతున్న ఈ స్మార్ట్ మొబైల్ పూర్తి ఉచితంగా ఇవ్వనున్నారు. ఇందులో దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఉంటాయి అయని అయితే రూపాయలకు 1500 మాత్రం సెక్యూరిటీ డిపాజిట్ గా తీసుకుంటారని అంబానీ చెప్పారు. మూడు సంత్సరాల తరువాత వాడిన మొబైల్ ను తిరిగి ఇచ్చేస్తే ఆ డబ్బు వాపస్ తీసుకోచ్చని ఆయన ప్రకటించారు. ఫోన్ సెప్టెంబర్ నుంచి మార్కెట్ లోకి రానుంది. అయితే బుకింగ్ మాత్రం వచ్చే నెల 24 నుంచే ప్రారంభమౌతాయని అంబాని వివరించారు. స్వాతంత్ర దినోత్సవం రోజునుంచే ఫోన్ మార్కెట్లో ప్రదర్శనకు పెడ్తామని ఆయన ప్రకటించారు. అయితే ఈ ఫోన్ ప్రతినెల రీచార్జ్ రేట్లు కూడా తక్కువగానే పెట్టడం విశేషం. ప్రతినెల రూపాయలకు 153 రిచార్జ్ చేసుకోవలసి ఉంటుంది. ఈ రిచార్జ్ తో అన్ని వాయిస్ కాల్స్ ఫ్రీ అదే విదంగా ఇంటర్నెట్ కూడా ఫ్రీగా వస్తుంది.

 


Other News