తెలుగు “బిగ్ బాస్” జూనియర్ ఎన్టీఆర్ … ఫస్ట్ లుక్ సూపర్

Jr NTR

 

తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు అరుదైన గౌరవం దక్కింది. దేశ వ్యప్తంగా మంచి ప్రజాదరణ పొందుతున్న బిగ్ బాస్ రియాల్టీ షోను హోస్ట్ చెయ్యబోతున్నారు. హిందిలో కలర్స్ టీవీలో ప్రసారం అయ్యే బిగ్ బాస్ రియాల్టీ షో మంచి ప్రజాదరణ సొంతం చేసుకుంది. ఇప్పటికే 10 సీజన్లు పూర్తి అవ్వగా 11 సీజన్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ సమయంలోనే బిగ్ బాస్ రియాల్టీ షోను తెలుగు , తమిళం లో చెయ్యాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గత కొంత కాలంగా కార్యక్రమాన్ని హోస్ట్ చేసే వ్యక్తుల కోసం వేట సాగుతోంది. దానికి జూనియర్ ఎన్టీఆర్ ను ఫైనల్ చేసేశారు.  ఇప్పుడు నేరుగా జూనియర్ ఎన్టీఆర్ నేరుగా తన ట్విట్టర్ అకౌంట్ https://twitter.com/tarak9999 లో ఫోటో పోస్ట్ చెయ్యడంతో విషయం నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే షో కు సంబందించిన ప్రోమో షూట్ ప్రారంభమైందని తారక్ చెప్పకనే చెప్పారు. ఓక బ్లాక్ సోఫాలో కూర్చొని కన్ను కొడ్తున్న ఫోటోను జూనియర్ పోస్ట్ చేశారు. తమిళంలో ఈ షోను సీనియర్ నటుడు కమలహాసన్ చెయ్యనున్నారు.

 

జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే జై లవకుశ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రియాల్టీ షోకు ఆయన ఒప్పుకుంటారా అన్న చర్చ చాలా కాలంగా సాగుతోంది. అయితే దేశ వ్యాప్తంగా క్రేజీ ఉన్న షో కావడం దానికి తోడు , రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో ఉండడంతో తారక్ ఈ షోకు ఒప్పుకున్నట్లు స్పష్టం అవుతుంది.

సెలబ్రిటీల పేరుతో కొందర్ని కొన్ని రోజుల పాటు ఒక చోట ఉంచడం , వారి కదలికలు నిరంతరం చిత్రించడం , వారి మద్య గొడవలు ఈ కాన్సెప్ట్ తో సాగే బిగ్ బాస్ షో సక్సస్ అవుతుందా అన్న సందేహం కూడా ఉంది. కలర్స్ టీవీలో హిందిలో రావడంతో నార్త్ ఇండియాలో ప్రజాదరణ పొందింది. మరి ఇప్పుడు సౌత్ లో ఇలాంటి ప్రయోగం ఎంత వరకు సక్సస్ అవుతుందో చూడాలి. అయితే తెలుగులో మాటీవీ ఈ కార్యక్రమాన్ని ప్రసారం చెయ్యనుంది. రేటింగ్స్ , రెవెన్యూ మీద కూడా మాటీవీ భారీ అంచనాలతో ఉంది. ఏది ఏమైనా తెలుగులో బిగ్ బాస్ సక్సస్ కాకపోతే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఇమేజీ డ్యామేజ్ కావడం ఖాయం.


Other News