బాహుబలిని కట్టప్ప చంపలేదా … ? బాహుబలి 2 ట్రైలర్ ఏమి చెప్తోంది.. ?

Baahubali 2 kattappa Baahubali

బాహుబలి … బాహుబలి … ఇప్పుడు దేశమంతా సినీ అభిమానులు చేస్తున్న జపం. మరో విషయం లేనట్లు దీనిపైనే ప్రధాన చర్చ జరుగుతోంది. బాహుబలి 2 కి సంబందించిన ట్రైలర్ రిలీజ్ అవ్వడం తో మరో సారి బాహుబలి ఫివర్ మొదలైంది. అయితే మొత్తంగా ఇప్పటి వరకు జరుగుతున్న చర్చకు రాజమౌళి మరో ట్కిస్ట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. సినిమా మొదటి పార్ట్ లో అమరేంద్ర బాహుబలిని తానే చంపానని కట్టప్ప ప్రకటిస్తాడు. ఆ వెంటనే సినిమా అయిపోయింది. ఆ తరువాత ఏం జరుగుతుంది అన్న ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నం సినిమా యూనిట్ చేసింది. బాహుబలి 2 ట్రైలర్ తో పాటు పార్ట్ 1 లోని కొన్ని  సీన్లను విశ్లేషిస్తే స్టోరీ మరోలా ఉండబోతోందనిపిస్తోంది. ఇందులో రెండు ప్రధానమైన అంశాలు.

1 కట్టప్ప బాహుబలిని చంప లేదు. పార్ట్ 2 లో అతన్ని రీ ఎంట్రీ ఇప్పించే అవకాశం ఉంటుంది.

2 సినిమా స్టోరీ రైటర్ కు క్లారిటీ లేదు.

బాహుబలి 2 రిలీజ్ అయితే ఈ రెండిటిలో ఏదో ఒకటి తేలిపోతుంది. ముఖ్యంగా ఈ వాదన రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. పార్ట్ 1 లో అమరేంద్ర బాహుబలిని చంపానని కట్టప్ప చివర్లో ఒప్పుకుంటాడు. కాని అదే సినిమాలో ఒక చోట బల్లాల దేవుడు దేవసేనతో మాట్లాడుతూ ఇంకొక సారి అమరేంద్ర బాహుబలిని చంపాలని ఉంది అంటాడు. అంటే ఒక సారి చంపాడని అర్దం . మరి ఇంకో సారి చంపాలని ఎలా అనుకుంటున్నాడు.. ? మరి కట్టప్ప తానే చంపానని ఎందుకు ప్రకటించాడు.. ? అందులో ఏమైనా ట్కిస్ట్ ఉందా .. ?

ఇది ఇలా ఉంటే బాహుబలి 2 ట్రైలర్ జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. ముఖ్యంగా కట్టప్ప బాహుబలిని పొడిచే సీన్ లో కత్తి అతని పక్కగా పోయినట్లు కనిపిస్తుంది. షూట్ చెయ్యడంలో లోపమా … ? లేక సీన్ ని ఇది రక్తి కట్టించ బోతోందా … ? మరో విషయం చూసుకుంటే అదే స్పాట్ లో కట్టప్ప కింద కూర్చొని ఉంటే ఏదో ఎత్తులో అమరేంద్ర బాహుబలి కత్తి పట్టుకొని కూర్చొని ఉండి మాట్లాడుతున్నట్లు కనపడుతోంది. అలా అయితే కట్టప్ప పొడిచిన తరువాత చనిపోవడానికి ముందు బాహుబలి మాట్లాడాడా .. ఏమి మాట్లాడి ఉంటాడు. అమరేంద్ర బాహుబలి చనిపోయినట్లు ఆ రాజ్యాన్ని నమ్మించాలని వ్యూహం చేస్తారా .. ?  అదే జరిగితే ఏమి ఆశించి అలా చేస్తారు.. ? అలా జరిగి ఉంటే  పార్ట్ 2 లో అమరేంద్ర బాహుబలి రీ ఎంట్రీ ఉంటుందా .. ? ఇలాంటి చాలా అంశాలు తెరమీదకు రాబోతున్నాయి. ఈ విషయాలన్నింటిలో క్లారిటీ రావాలంటే మాత్రం బాహుబలి 2 రిలీజ్ కావలసిందే..

 

 


Other News