తనను తాను అభినందించుకున్న కేసీఆర్

kcr

 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. తనను తాను అభినందించుకున్నారు.  తాను పుట్టిందే చరిత్ర సృష్టించడానికేమో అని అభిప్రయపడ్డారు. ఇటీవల కాలంలో తన ప్రభూత్వం చేపడుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని ఆయన వివరించారు. దశల వారీగా రైతాంగ రుణమాఫీ చేసిన ప్రభూత్వం అది సంపూర్ణం అయిన సందర్బంగా సీఎం క్యాంప్ ఆఫీస్ జనహితలో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో కేసీఆర్ గురువారం మాట్లాడారు. ఎవ్వరూ ఊహించని తెలంగాణ సాధించిన నేను రాష్ట్రాన్ని సమర్ధవంతంగా నడుపుతన్నానని ఆయన వివివరించారు. అదే విధంగా రాష్ట్రంలో రైతు రుణమాఫీ విషయంలో కూడా దేశంలోనే మనం రికార్డు సృష్టించామని స్పష్టం చేశారు. దాదాపు 17 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని వివరించారు. అదే విధంగా రైతుల చిరకాల స్వప్నం 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రైతులే వచ్చి మాకు 9 గంటల నిరంతర విద్యుత్ వద్దు 6 గంటలు చాలు అని చెప్పే పరిస్థితి వచ్చిందని ఆయన ప్రకటించారు. ఇటువంటి సమయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఉచిత ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు 55 లక్షల మంది రైతులకు ఈ పథకం ఉపయోగ పడుతుందని కేసీఆర్ వివరించారు. బంగారు తెలంగాణ సాధించాలంటే ఇలాంటి పథకాలు అమలు జరగాల్సిందే అని చెప్పిన కేసీఆర్ అన్ని పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తానని హామీ ఇచ్చారు.


Other News