ముస్లీంలకు రిజర్వేషన్లు వద్దన్న బీజేపీ .. ఎస్టీలకు వద్దంటున్నారంటూ లొల్లి చేసిన టీఆర్ఎస్

kcr

 

తెలంగాణ రాష్ట్ర అసేంబ్లీ ఎట్టకేలకు వివాదాస్పద ముస్లీం రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం తెలిపింది. అయితే రాజ్యంగా బద్దంగా అందరికీ ఆమోదయోగ్యమైన ఎస్టీ రిజర్వేషన్ల పెంపు అంశం కూడా ఇదే వివాదాస్పద బిల్లులో చేర్చింది. మొత్తంగా ముస్లీంలకు ఇప్పటికే ఇస్తున్న 4% తోడు మురో 8% కలిపి మొత్తం 12% ఇవ్వాలని , ఎస్టీలకు ఇప్పటికే అమల్లో ఉన్న 6% కు తోడు మరో 4 % కలిపి మొత్తం 10% రిజర్వేషన్లు ఇవాలన్నది ఈ బిల్లు సారాంశం. ఈ సందర్బంగా కొన్ని విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా గతంలో చెప్పిన ప్రకారమే రిజర్వేషన్లు ఇవ్వడానికి టీఆర్ఎస్ ముందుకు పోతే , దాన్ని అడ్డుకుంటామంటూ బీజేపీ ఆందోళనలు చేసింది. అయితే విచిత్రంగా అధికార పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగింది. అది కూడా బీజేపీ ఎస్టీ రిజర్వేషన్లను అడ్డుకుంటుందంటూ లొల్లి చెయ్యడం హైలైట్. ఎస్టీ రిజర్వేషన్ల పెంపును బీజేపీ ఎక్కడా వ్యతిరేకించలేదు. ముఖ్యంగా ముస్లీం రిజర్వేషన్లతో కలిపితే ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని బీజేపీ వాదించింది. దీన్నంత పక్కన పెట్టిన టీఆర్ఎస్ బీజేపీ ఎస్టీల రిజర్వేషన్లు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందంటూ ఆందోళనలు చేసింది. బీజేపీ ముస్లీంలకు రిజర్వేషన్లు వద్దంటోంది అన్న విషయాన్ని చెప్పలేదు. మరో వైపు టీఆర్ఎస్ కు అనుకూలంగా ముస్లీం మైనార్టీలు కూడా ఎవ్వరూ బయటకు రాలేదు.

 

వాస్తవానికి ఎస్టీ రిజర్వేషన్లు బిల్లు వేరుగా పెట్టాల్సింది. అది సునాయాసంగా అమలు జరిగేది. ఎందుకంటే ఎస్టీలకు రిజర్వేషన్లు పెంపు అంశం రాజ్యంగం కల్పించిన హక్కు. ముస్లీంలను రిజర్వేషన్ బిల్లు వేరుగా వెలితే తిరస్కరణకు గురౌతుందనుకున్నారో లేక మరే కారణమో కాని రెండు రిజర్వేషన్లను ప్రభుత్వం కలిపింది. దీన్నే బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా బలంగా వ్యతిరేకించాయి. ఆ రెండిటిని కలపాల్సిన అవసరం ఏమొచ్చిందని దాదాపు అన్ని పార్టీలు అసేంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసాయి. చివరకు దిగివచ్చిన సీఎం కేసీఆర్ చాన్స్ ఉంటే ప్రత్యేక జీఓ ఇవ్వడం ద్వారా ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చెయ్యడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

నమ్మని ఎంఐఎం… ?

ప్రభుత్వం ప్రతిపాధించిన ముస్లీం రిజర్వేషన్ల పెంపు అంశం పై ఎంఐఎం జాగ్రత్తగా స్పందించింది. ఎంఐఎం కీలక నేత అక్బరుద్దిన్ ఓవైసీ సభక హాజరు కాలేదు. మరో నేత పాషా ఖాద్రీ సభలో మాట్లాడారు. ముస్లీంల రిజర్వేషన్ల పెంపును స్వాగతిస్తున్నామంటూనే అమలు చెయ్యాల్సిన బాధ్యత మీదే అని చెప్పుకొచ్చారు. మరో నేత మోజాం ఖన్ మాట్లాడుతూ ముస్లీంలకు రిజర్వేషన్ల పెంపు ప్రక్రియలో తెడా వచ్చి ఇప్పటికే అమలు జరిగుతున్న 4% కూడా పోయే పరిస్తితి వస్తుందేమో అని ఆందోళన వ్యక్తం చేశారు. అవసరం అనుకుంటే ఇప్పడు బీసీ ఈ లో ఉన్న రిజర్వేషన్లను అలాగే వదిలేసి బీసీ ఎఫ్  కేటగిరీ లో ఇప్పుడు పెంచుతున్న 8% రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. మొత్తంగా ఎంఐఎం మాత్రం గతంలోకన్న భిన్నంగా సభలో వ్యవహరించడం కనిపించింది.


Other News