రాష్ట్రపతి అభ్యర్థిగా దళితున్ని నిర్ణయించిన బీజేపీ .. జై కొట్టిన టీఆర్ఎస్

Ramnath kovid

 

రాష్ట్రపతి ఎంపిక విషయంలో ఎవరూ ఊహించని ట్వీస్ట్ ఇచ్చిన బీజేపీ

దళితుడైన రామ్ నాథ్ కోవింద్ ను తమ అభ్యర్థిగా ప్రకటన.

నిమిషాల్లోనే మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్.

 

రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో సుధీర్ఘ కసరత్తు చేసిన బీజేపీ దళితుడికే జై కొట్టింది. అనూహ్యంగా సీనియర్ రాజకీయ నేత , దళిత నాయకుడు రామ్ నాథ్ కోవింద్ పేరును తెరమీదకు తీసుకొచ్చింది. ప్రతిపక్ష పార్టీలను అత్మరక్షణలో పడేసింది. ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న నేతలందర్నీ పక్కన పెట్టింది బీజేపీ . ముఖ్యంగా ఎల్ కే అద్వానీ , మురళీ మనోహర్ జోసీ , సుమిత్రా మహాజన్ , సుష్మాస్వరాజ్ లాంటి నేతలను ఎన్డీఏ తమ అభ్యర్థిగా ప్రకటిస్తారని భావించినప్పటికీ చివరి నిమిషంలో బీజేపీ వ్యూహం మార్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఎన్డీఎకు పూర్తిస్థాయిలో మెజార్టీ లేకపోవడంతో ఇప్పటికే ఎన్డీఏకు దూరంగా ఉన్న పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం కూడా గత కొంత కాలంగా బీజేపీ చేసింది. దీనికి తోడు ప్రతిపక్షపార్టీలను కౌంటర్ చెయ్యడానికి దళిత కార్డ్ మినహా మరో మార్గం బీజేపీ కి కనిపించలేదు. దీంతో సీనియర్ దళిత నేత , ప్రస్తుతం బిహార్ గవర్నర్ గా ఉన్న రామ్ నాథ్ కోవింద్ ను ప్రకటించేసింది. రామ్ నాథ్ కోవింద్ రాజకీయ నేతగ సీనియర్ కావడమే కాకుండా దళిత నేతగా సూధీర్ఘ కాలం పనిచేశారు. కోలీ సమాజ్ జాతీయ కమీటీ అధ్యక్షుడుగా , బీజేపీ దళిత మోర్చా జాతీయ అధ్యక్షుడుగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉన్నది. బీజేపీ వేసిన వ్యూహం ఫలిస్తుందన్న ధీమా పార్టీ నేతల్లో కనిపిస్తోంది.

జైకొట్టిన టీఆర్ఎస్

రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ ను ప్రకటించిన వెంటనే మద్దతు కూడగట్టే ప్రయత్నలను బీజేపీ ముమ్మరం చేసింది. ఎన్డీఏ మీటింగ్ ముగియగానే ప్రధాని నరేంద్రమోడీ రంగంలోకి దిగారు. వివిధ రాష్ట్రలకు చెందిన ముఖ్యమంత్రులు , పార్టీల అధ్యక్షులకు నేరుగా ప్రధాని మోడీ ఫోన్ చేశారు. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. అందరికంటే ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. బీజేపీ ప్రతిపాధించిన రామ్ నాథ్ కోవింద్ తమకు అమోదయోగమైన అభ్యర్థి అని. ఆయనకు తాము మద్దతు ఇస్తున్నట్లు కేసీఆర్  ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా కేసీఆర్ చేసిన సూచన మేరకే దళితున్ని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకుంటున్నందున తమకు మద్దతు ఇవ్వాలని మోడీ  కోరినట్లు కేసీఆర్ ప్రకటించారు.


Other News