రాజీనామా లేఖలో రేవంత్ రెడ్డి చేసిన పెద్ద తప్పు ఏంటి ?

 

revanth

రాజకీయాల్లో అత్యంత చాకచక్యంగా వ్యవహరించే రేవంత్ రెడ్డి రాజీనామా లేఖలో మాత్రం పెద్ద తప్పు చేశాడా … ? టీడీపీకి ఆయన పంపిన రాజీనామా లేక ఇప్పుడు ప్రత్యర్థులకు అస్త్రం కానుందా … ? చాలా తెలివిగా రాజకీయాలు నడుపుతు అతి తక్కువ కాలంలో రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన రేవంత్ రెడ్డి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు… ? ఇప్పుడు రేవంత్ రాజకీయాలను దగ్గరగా చూస్తున్న వారు చర్చించుకుంటున్న అంశాలు ఇవే. ఎందుకంటే రేవంత్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.  రాజీనామాల లేఖ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నరు. ముఖ్యంగా పార్టీలో నేతలపై ఎక్కడా ఆరోపణలు చెయ్యలేదు. పార్టీలో తప్పులె ఎత్తి చూపలేదు. టీడీపీకి ఇచ్చిన రాజీనామా లేఖను కూడా కేసీఆర్ ను తిట్టడానికే వాడుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది కాని రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు విషయంలో చేసిన ఒక సంబోధన ఇప్పుడు వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంది. తెలంగాణకు చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా మొసం చేసే ప్రయత్నం చేసాడన్న అభిప్రాయం చాలా మందిలోఉంది. అందుకే ఆయనను తెలంగాణలో ఆంధ్రాబాబు అని పిలుస్తుంటారు. మరి అటువంటి ఆంధ్రాబాబును రేవంత్ రెడ్డి తన లేఖలో తండ్రి లాంటి వారు అని సంబోధించారు. ఆయన ఆశీస్సులు కావాలని వేడుకున్నారు.

తెలంగాణలో రాజకీయం చెయ్యాలనుకుంటున్న రేవంత్ రెడ్డి ఆంధ్రబాబు ఆశిస్సులు ఎలా ఉంటాయి. మరి ఆంధ్రాబాబు ఆశిస్సులు ఉన్నా, అవి ఆంధ్రకు అనుకూలంగా ఉంటాయే తప్ప తెలంగాణకు అనుకూలంగా ఉండవు కదా . ఇంతే కాదు ఇప్పుడు కాంగ్రెస్ నేతగా మరిన రేవంత్ రెడ్డికి మరి టీడీపీ బాబు ఎలా మద్దతు ఇస్తాడు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో వైరి పక్షం రెవంత్ రెడ్డిని ఇరుకున పెట్టే అవకాశం ఉంది. ఇలాంటి ప్రశ్నలకు రేవంత్ ఎలా సమాధానం చెబుతాడో చూడాలి మరి.


Other News