రేవంత్ రేడ్డి రాజీనామా ఉత్తదేనా … ?


Revanth joins congress

 

తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన రేవంత్ రెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్ . ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. డిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్లలో కూడా చాలా మంది రేవంత్ కు అండగా నిలబడడంతో చేరిక సాఫీగానే సాగింది. అదే విధంగా టీడీపీ కి చెందిన మాజీ ఎమ్మెల్యేలు సీతక్క , విజయరమణారావు లాంటి మరి కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరిపోయారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్న వెంటనే పక్క రాష్ట్రంలోని ఆయన పార్టీ అధినేతను కలసి రాజీనామా పత్రం సమర్పించారు. ఆయనకు విధేయుడుగా ఉంటానని ప్రకటించేశారు. అదే విధంగా ఆ పార్టీ ద్వారా వచ్చిన తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్ననని చెప్పుకున్నారు. ఆ కాపీలను సోషల్ మీడియాలో ఫుల్ గా సర్క్యూలేట్ కూడా చేశారు. దీంతో రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేశారు. పార్టీ మారిన వెంటనే ఎమ్మెల్యే పదవి వదులుకున్నాడని ప్రశంసించారు.

కాని సీన్ మరోలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణ అసేంబ్లీకి రేవంత్ రెడ్డి రాజీనామా చేరలేదట. రాజీనామా చెయ్మాలి అనుకుంటే అసేంబ్లీలో స్పీకర్ కు కాని , కార్యదర్శికి గాని లేఖ ఇవ్వాల్సి ఉంటుంది కనీసం ఫాక్స్ ద్వారా పంపాలి. అలా జరగలేదు అంటున్నారు. ఎమ్మెల్యే రాజీనామా పత్రాన్ని కూడా చంద్రబాబుకే ఇచ్చి ఉంటాడని టీటీడీపీ నేతలు భావిస్తున్నారు. అలాగే జరిగితే పక్క రాష్ట్రంలో రాజీనామా పత్రం పెట్టి మన రాష్ట్రంలో ఆమోదించమని కోరినట్లు అవుతుంది. మరి ఇప్పటికైనా ఆ రాజీనామా పత్రం తెలంగాణ అసేంబ్లీకి చేరేలా రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తారా లేదా చూడాలి.


Other News