అయోధ్య లో రామ మందిర నిర్మాణానాకి  క్లియర్ అవుతున్న లైన్… సుప్రీం కోర్టు ఏమి చెప్పింది… ?

Babri masjid Dimalision

దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించేలా కనిపిస్తోంది. సుప్రీం కోర్టు మంగళవారం చేసిన సూచన జాతీయస్థాయిలో మరొక్కసారి ఈ అంశం పై చర్చకు తెరతీసింది. బీజేపీ సీనియర్ నేత , ఎంపీ సుబ్రహ్మణ్య స్వామీ వేసిన కేసులో సుప్రీం కోర్టు స్పందించింది. అయితే ఈ సమస్యను కోర్టు బయట పరిష్కరించుగలిగితే మంచిదని సూచించింది. ముఖ్యంగా ఇది చాలా సున్నితమైన సమస్య కావాడం వల్ల రెండు పక్షాలు కూర్చొని చర్చించుకోవాలని సలహా ఇచ్చింది. అయితే అది రెండు పక్షాలకు అమోదయోగ్యం అయితే మాత్రమేనని స్పష్టం చేసింది. దీనికి సంబందించి తమ అభిప్రాయాలను ఈ నెల 31న తమకు తెలుపాలని కోర్టు ఆదేశించింది.

పరిణామాలన్ని రామాలయ నిర్మాణానాకి మార్గాన్ని సుగుమం చేస్తున్నాయని హిందుత్వవాదులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా భారత దేశ చరిత్రలోనే యూపీలో బీజేపీ భారీ విజయం సాధించడం ఇందులో కీలక పరిణామం . దానికి తోడు హిందు అతివాదిగా పేరున్న యోగీ అధిత్యానాథ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. హిందు అతివాధీగా ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ముస్లీం వర్గాల్లో కూడా సానుకూల అభిప్రాయాన్ని సంపాదించుకోగలిగారు యోగీ . ఇంత కాలంగా నలుగుతున్న అయోధ్య సమస్యకు పరష్కారం కావాలని యూపీలోని ముస్లీంలు కూడా కోరుకుంటున్నారు. అయితే ఎంఐఎం లాంటి పార్టీలు ఈ వివాధం కొనసాగాలని కోరుకుంటున్నాయి. ఈ అంశాన్ని బూచిగా చూపి ఓట్లు పొందొచ్చన్న యోచనలో ఉన్న ఎంఐఎం సుప్రీం కోర్టు సూచనను తప్పుబట్టింది. మీడియాతో మాట్లాడిన ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ  ఈ సమస్యకు పరిష్కారం కోర్టు బయట సాధ్యం కాదని చెప్పారు. కేసులో కీలక వ్యక్తి సుబ్రహ్మణ్య స్వామి మాత్రం సుప్రీం సలహాను స్వాగతించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సమస్య ఇంకా కొనసాగడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.

సరయూ నధి పక్కన మసీదు.

అయోధ్య రామమందిర పరిష్కారానికి సుబ్రహ్మణ్యస్వామి ఓ పరిష్కారాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడున్న వివాదాస్పద స్థలం పూర్తిగా హిందువులది అనే చారిత్రక ఆధారాలు ఉన్నాయి గనుక అది రామాలయ నిర్మాణానికి వదియలేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. సరయూ నదికి అటువైపు బాబ్రీ మసీదు కట్టించి ఇవ్వాలని స్వామి సూచించారు. ఏది ఏమైనా ఈ వ్యవహారంపై యూపీ సీఎం దృష్టి పెడితే వెంటనే సమస్య పరిష్కారం అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.


Other News