తెలంగాణలో బాహుబలి టీంకు దిమ్మతిరిగే వార్నింగ్ … తలసానికి షాక్ ఇచ్చిన అధికారులు…

warning to Bhahubali 2

 

దేశమంతా ఇప్పుడుక ఒక్కటే నినాధం బాహుబలి … బాహుబలి… సినీ ప్రేమికుల్లో ఆసక్తి రేకెత్తించిన సినిమా టీం ఇప్పటికే దొరికినంతా దోచేసింది. ప్రపంచ వ్యప్తంగా వందల కోట్ల రూపాయల వ్యపారం చేసింది. ఇది చాలదు అన్నట్లు దొరికినన్ని అడ్డదారులు తొక్కేస్తోంది. సినిమా టికెట్లు ఇప్పటికే ఎక్కడికక్కడ దాచేసి బ్లాక్ మార్కెట్ కు తరలించారు. దీనికి తోడు టికెట్ల రేట్లు అమాంతం పెంచేశారు.  150 రూపాయల టికెట్ 400 రూపాయలు అమ్ముతున్నారు. అదేంటని అడిగితే 250 రూపాయల విలువగల స్నాక్స్ ఇస్తామని చిప్స్ పాకెట్స్ చూపిస్తున్నారు.

 

సినిమా పిచ్చొల్ల జేబులు కొట్టడానికి అన్ని మార్గాలూ వాడుకుటోంది సినిమా టీం. మరో వైపు తమకు సాయం చెయ్యండంటూ కలవగానే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభయహస్తం చూపించారు. సాధారణంగా ప్రదర్శించే నాలుగు షోలకు బదులుగా 5 షోలు వేసుకోవచ్చని అభయం ఇచ్చిండు. దీనికి తోడు ఇంకా ఏమెమి చెప్పిండో ఏమో కాని ఇక సినిమా టీం రెచ్చి పోయింది. హైదరాబాద్ నైజాంలో రెచ్చి పోయింది. బెనిఫిట్ షో వేస్తామంటూ మరో డ్రామా మొదలు పెట్టింది. మరో వైపు రేట్లు విపరీతంగా పెంచేశారు.

తెలంగాణ సినిమా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మావాడే అన్నట్లు డ్రామాలు చేస్తున్న బాహుబలి టీంకు అధికార యంత్రాంగం అడ్డుకట్ట వేసింది. నేరుగా కమర్షియల్ టాక్స్ డిపార్ట్ మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. బాహుబలి సినిమా నిబందనలు అతిక్రమిస్తే సహించేది లేదని హెచ్చరించారు. దీనికితోడు బాహుబలి సినిమా టికెట్లు ఎక్కడైన అధిక ధరలకు విక్రయిస్తే తమకు ఫిర్యాదు చెయ్యమని టోల్ ఫ్రీ నంబర్ 18004253787 ఇచ్చేశారు.

అధికారులు నేరుగా ప్రెస్ నోట్ రిలిజ్ చేసిన వెంటే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా ముందుకు వచ్చి బాహుబలి సినిమా టీం నిబందనలకు విరుద్దంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం బెనిఫిట్ షో అంటూ జరిగిన ప్రచారం పై సీరియస్ అయ్యారు. దానికి తాము అనుమతి ఇవ్వలేదని స్సష్టం చేశారు.


Other News