రాష్ట్రంలో వేగంగా గొర్రెల పంపిణీ… కోటిలో ఇంకా జస్ట్ 95 లక్షలే బాకీ ఉన్నయ్.

 

CM KCR with BCs

 

అవును బై గొర్రెల పంపిణీ జోరు పెంచినం …

కోటి గొర్రెలు ఇస్తమన్నం … ఇప్పటి దాక 4.20 లక్షలు ఇచ్చినం..

ఇంకెంత 95 లక్షల చిల్లర కద ఇచ్చేస్తం లే..

ఔ ఇప్పటి దాక 7.50 లక్షల మంది అప్లై జేశిండ్రు.. అందులో 20 వేల మందికిచ్చినం..

మిగిల్నోల్లకు కూడా ఇచ్చేస్తం లే… మా సీఎం చెప్పిండు అందుకే ఇంత స్పీడ్ గ ఇస్తున్నం.

ఇది మనల్ని ఏలుతున్నోల్ల ఇగ్రం. సీఎం కేసీఆర్ చెప్పి నెలలు గడుస్తున్నా గొర్రెల పంపిణీ ముందుకు సాగుతలేదు. రోజుకొక్క కథ చెప్పి అధికారులు , ప్రజా ప్రతినిధులు తప్పించుకుంటున్నరు. సీఎం కేసీఆర్ చెప్పిన లెక్కలు సక్కగనే ఉన్నా… అమలు జరుగుతన్నది మాత్రం సక్కంగ లేదు. తెలంగాణలో యాదవులకు ఆశలు కల్పించిన ప్రభుత్వం మూడు నెలలు పూర్తైనా ఇంత వరకు పథకం అమలు మాత్రం ముందుకు సాగుతలేదు. ప్రారంభంలో 84 లక్షల గొర్రెలు మాత్రమే పంపిణీ చెయ్యాలని భావించినప్పటికీ దాదాపు 7.50 లక్షల దరఖాస్తులు రావడంతో ఆ సంఖ్య పెంచాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు.

కాని పంపిణీ సరిగ్గ జరుగుతలేదు. ఇదే వేగంతో పంపిణీ చేస్తే పది సంత్సరాలు కావాలే. మూడు నెలలు పూర్తైంది ఇప్పటి వరకు అనుకున్న టార్గెట్ లో కేవలం 5 శాతం గొర్రెలనే పంచిండ్రు. ఇంకా మిగిలింది 95 శాతం. సర్కారు ఎన్ని చెప్తున్నా ఆఫిసర్లు మాత్రం ఇది అంత ఈజీ కాదని చెబుతున్నారు. మంత్రి మాత్రం రివ్యూ మీటింగ్లు పెడ్తు స్పీడ్ పెంచాం అని చెప్తున్నడు. మొన్నెప్పుడో గొర్రెల పంచడంపై ప్రతిపక్షపార్టీ నేతలు అనుమానం పడితే వారిని సీఎం కేసీఆర్ గొర్రెలతో పొల్చిండు. వాళ్లను పట్టించుకోవద్దని చెప్పిండు. మరి కనీసం ఇపటికైనా సీఎం గొర్రెల పంపకం మీద నజర్ ఎయ్యాలే. ఏది ఏమైనా రాష్ట్రంలో యాదవుల జీవితాలు మార్చేస్తానంటున్న సర్కార్ ఈ పథకం సరిగ్గ అమలు చెయ్యక పోతే యాదవులే పాలకుల జీవితాలు మాచ్చేస్తరన్నది యాదిపెట్టుకోవాలే.


Other News