Tv9 V/s V6 రెండు చానళ్ల మధ్య లొల్లి పెట్టిన హారిక కేసు… ఎవర్ని నమ్మాలి ? 

 

Harika Yogi

షార్ట్ ఫిల్మ్ నటి హారిక కేసు చిలికి చిలికి గాలివానగా మారుతోంది. పోలీస్ స్టేషన్ లో నిందితున్ని అడీషనల్ డీసీపీ తన్నిన వీడియో వివాదాన్ని రేపుతుండగా, ఆ వ్యవహారం ఇప్పుడు రెండు ప్రధాన చానళ్ల మధ్య లొల్లి పెట్టింది. రెండు చానళ్లు పరస్పర విరుద్ధంగా వార్తలు ప్రసారం చేశాయి. ఖాకీల జూలూం అన్నట్లు Tv9 వార్తలు ఇస్తే , శబాష్ గంగిరెడ్డి అంటూ పోలీసులను అభినందిస్తు V6 వార్తలు ప్రసారం చేసింది.

అసలు విషయాలు చూస్తే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగేష్ కు షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన హారికతో పరిచయం ఉంది. వారిద్దరి మధ్య వివాదాలు తలెత్తడంతో తనను వేధిస్తున్నడని హారిక పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో అవసరానికి మించి స్పందించిన అడీషనల్ డీసీపీ గంగిరెడ్డి నిందితున్ని చితక్కోట్టారు. యోగీని డీసీపీ తంతున్న వీడియో ఎవరో రికార్డ్ చెయ్యడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

ఈ అంశాన్ని రిపోర్ట్ చేసేందుకు రెండు చానాళ్లు చెరో దారి ఎంచుకున్నాయి.  హైదరాబాద్ ఖాకీల ఓవర్ యాక్షన్ అన్న కోణంలో Tv9 వార్తలు ఇచ్చింది. దీనికి పోలీసుల చేతుల్లో తన్నులు తిన్న యోగీ ఇంటర్వూను కూడా ప్రసారం చేసింది. ఖాకి చొక్కా వేసుకోగానే పోలీసులు తాము ఎవ్వరినైనా కొట్టొచ్చని ఫీలౌతున్నారంటు వివరించింది.

కాని V6 టీవీ వార్తలు పూర్తి విరుద్దంగా ఉన్నాయి. నిందితున్ని విచక్షణారహితంగా తన్నిన అడీషనల్ డీసీపీ గంగిరెడ్డిని హీరో చేశారు. శభాష్ గంగిరెడ్డి అన్న లైన్ లో వార్తల ప్రసారం జరిగింది. పూర్తిగా హారిక కోణంలోనే న్యూస్ నడిచింది.

మొత్తంగా షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి , నటి హారిక వ్యవహారంలో రెండు చానళ్లు చెరో వైపు ఉన్నాయి . మరి మీరు ఎక్కడ ఉంటారు ? డైరెక్టర్ యోగి అమ్మాయిల ఫోటోలు సేకరిస్తూ … షర్ట్ ఫిల్మ్ ఆశ చూపించి మోసం చేస్తున్నాడన్న హారిక ఆరోపణలు నమ్ముతారా .. ? లేక తన రహస్యాలు బయటపడుతాయనే హారిక తనను పోలీసులతో కొట్టించిందంటున్న యోగి మాటలు నమ్ముతారా …? మొత్తంగా ఎవర్ని ఫాలో కావాలి Tv9 or V6 ?


Other News