టెర్రరిస్ట్ ‘ భాయ్’ ఏందిరా … ? మతం పట్టి మర్యాదలుంటాయా .. ? మీరూ… మీ చెత్త రిపోర్టింగ్ …

Terrorist attack on amarnath yatra

 

మీడియాలో మత రాజకీయాలు పెరుగుతున్నాయి. వ్యక్తులకు మతాలను పట్టి మర్యాదలు ఇస్తున్నారు. మైనార్టీ వర్గాలు అనగానే ఎనలేని గౌరవం పుట్టుకొస్తోందెందుకో అర్ధం కాదు. మెజార్టీ ప్రజలకు సంబందించిన మహానుభావులకు కూడా కనీస మర్యాద ఇవ్వడానికి ఇష్టపడని మీడియా ముస్లీం మైనార్టీ అనగానే టెర్రరిస్టులకు కూడా మర్యాదలు ఇస్తోంది. అచ్చంగా ఇప్పుడు అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేసిన సందర్భంగా జరుగుతున్న రిపోర్టింగ్ లో కూడా అదే కనిపిస్తోంది. ఎవడో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాది ఇస్మాయిల్ అనే వేస్ట్ ఫెలో దాడి చేస్తే మీడియా ఇస్మాయిల్ భాయ్ దాడి చేశాడంటూ వాన్ని గౌరవిస్తోంది. జాతీయ మీడియాతో పాటు స్థానికంగా ఉన్న కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి ఓవరాక్షన్ చేస్తున్నాయి. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర పై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి , ఏడు మంది అమాయకులను పొట్టన పెట్టుకుంటే ఆ రిపోర్టింగ్ చేసేప్పుడు ‘పవిత్ర’ అమర్నాథ్ యాత్ర అని చెప్పడానికి వారికి మనసు ఒప్పుకోదు కాని దాడి చేసిన ఉగ్రవాదికి మాత్రం భాయ్ అంటూ గౌరవం ఇస్తున్నారు. ఈ రిపోర్టింగ్ ను ఏమనాలి. అసలు భాయ్ అంటే వీరికి అర్థం తెలుసా. సోదరున్ని పిలుచుకునే పధం మరి ఆ టెర్రరీస్టు మీకు భాయ్ అయితే మీరేంటో ఆ మీడియా సంస్థలు , అందులో పనిచేసుకునే వారే ఆలోచించుకోవాలి.

ఇలాంటి సందర్బాలు అనేకం ఉన్నాయి. తెలుగు మీడియాలో కూడా చాలా మంది జర్నలీస్టులు గతంలో కూడా ఇలాంటి విధానాన్నే అనుసరించారు. కొందరు తమంత గొప్ప జర్నలీస్టు భూమి మీదే లేడు అనుకునే వారు సీఎం , సీఎస్ లను కూడా ఏకవచనంతో పిలుస్తుంటారు. మిస్టర్ చంద్రబాబు , మిస్టర్ కేసీఆర్ అని పిలిచిన సందర్బాలు అనేకం కాని వారంతా ఎంఐఎం నేతలను చూస్తే మాత్రం ప్యాంట్ తడుపుకుంటారు. అసద్ భాయ్ , అక్బర్ భాయ్ అంటూ పిలుస్తుంటారు. తెలుగు మీడియాలో ఉన్న చాలా మందికి ఇది తెలిసిన విషయమే. ఈ రకంగా మతాలను చూసి మర్యదలు ఇవ్వడం ఏ జర్నలిజం విలువలో ఆ మహానుభావులే చెప్పాలి.

 


Other News