మెజార్టీ ప్రజలే టార్గెట్ గా ఈటెల నాలుగో బడ్టెట్.

Eatela Rajendar Signs on Budget books

Eatela Rajendar Signs on Budget books

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈటెల రాజేందర్ నాలుగో సారి విజయవంతంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కేటాయింపుల్లో పెద్ద తేడాలు లేక పోయినా బడుగు బలహీణ వర్గాలను టార్గెట్ చేసుకొని బడ్జెట్ రూపకల్పన జరిగింది. మత్స పరిశ్రమకు , గొర్రెల పరిశ్రమలకు ప్రధాన్యత ఇస్తున్నామని ప్రకటించడం ద్వారా ప్రభుత్వం బీసీల్లో మెజార్టీ ప్రజలైన ముదిరాజ్ , యాదవ , బెస్త కులాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అదే విధంగా నాయిబ్రాహ్మణులు , చేనేత కార్మికులు , మైనార్టీల , బ్రాహ్మణులు , జర్నలీస్టులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అదే విధంగా కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఇస్తున్న మొత్తాన్ని 75 వేలకు పెంచింది. నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఖజానా పై ప్రభావం పడుతుందని భావించినా .. ఇతర మార్గాల నుంచి వచ్చిన పన్నులు గట్టెక్కించాయిని ఈటెల ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ బడ్జెట్ లో మార్పులు చేశారు. ప్రణాళిక , ప్రణాళికేతర వ్యయానికి బదులుగా ప్రగతి పద్దు , నిర్వహణ పద్దును ప్రవేశపెట్టారు.

వివరాలు చూసుకుంటే ….

 • రాష్ర్ట బడ్జెట్ రూ. 1,49,646 కోట్లు
 • ప్రగతి పద్దు రూ. 88,038 కోట్లు
 • నిర్వహణ వ్యయం రూ. 61,607 కోట్లు
 • రెవెన్యూ మిగులు అంచనా రూ. 4,571 కోట్లు
 • ద్రవ్య లోటు రూ. 26,096 కోట్లు

 

 

 • ఎస్టీల అభివృద్ధికి రూ. 88 కోట్లు
 • ఎస్సీల అభివృద్ధికి రూ. 14,375 కోట్లు
 • బీసీ సంక్షేమం కోసం రూ. 5,070 కోట్లు
 • మహిళా శిశు సంక్షేమం కోసం రూ. 1731 కోట్లు
 • మైనార్టీ సంక్షేమం కోసం రూ. 1249 కోట్లు
 • ఆసరా ఫించన్ల కోసం రూ. 5,330 కోట్లు
 • బ్రహ్మణుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు
 • ఫీజు రియింబర్స్ మెంట్ కోసం రూ. 1939 కోట్లు
 • చివరి విడత రైతుల రుణమాఫీకి రూ. 4000 కోట్లు
 • చేనేత కార్మికుల కోసం రూ. 1200 కోట్లు

 

 • ఇరిగేషన్ కు రూ. 26,652 కోట్లు
 • విద్యారంగ అభివృద్ధికి రూ. 12,705 కోట్లు
 • వైద్య, ఆరోగ్య రంగాలకు రూ.5,976 కోట్లు
 • పంచాయతీరాజ్ వ్యవస్థకు రూ. 14,723 కోట్లు

 

 • పట్టణాభివృద్ధికి రూ. 5,599 కోట్లు
 • మిషన్ భగీరథకు రూ. 3000 కోట్లు
 • రహదారుల అభివృద్ధికి రూ. 5,033 కోట్లు
 • జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ. 30 కోట్లు
 • మిగతా కార్పొరేషన్లకు రూ. 400 కోట్లు
 • గ్రేటర్ వరంగల్ కు రూ. 300 కోట్లు

 

 • జీహెచ్ఎంసీకి రూ. 1000 కోట్లు
 • పర్యాటక, సాంస్కృతిక రంగానికి రూ. 198 కోట్లు
 • శాంతి భద్రతలకు రూ. 4,828 కోట్లు
 • ఐటీ రంగానికి రూ. 252 కోట్లు
 • హరితహారానికి రూ. 50 కోట్లు
 • విద్యుత్ రంగానికి రూ. 4,203 కోట్లు
 • పారిశ్రామిక రంగానికి రూ. 985 కోట్లు

 


Other News