ఆంధ్రా చౌదరిని కాపాడేందుకు… చచ్చిన తెలంగాణ రెడ్డి మీద నిందలా .. ?

Sirisha

 

హైదరాబాద్ లో బ్యూటీషియన్ శిరీష మృతి కేసు విచారణ దారి తప్పింది. అసలు విషయాలు వదిలేసి కొసరు విషయాల మీద విచారణ సాగుతోంది. ఇదంతా పోలీసులే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా … లేక మరెవరైనా కేసును తప్పుదారి పట్టిస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది. ముఖ్యంగా ఈ కేసులో అసలు పాత్రధారి , సూత్రధారి వల్లభనేని రాజీవ్ చౌదరిని వదిలి పెట్టి చనిపోయిన ప్రభాకర్ రెడ్డి గురించి ఎక్కువ చర్చ ఎందుకు జరుగుతోంది అన్నదే ప్రధాన ప్రశ్న. వల్లభనేని రాజీవ్ చౌదరి ఫోటో స్టుడీయో పేరుతో నడుపుతున్న వ్యపారం ఏంటి… ఇప్పటికే మోగుడు , పిల్లలు ఉన్న శిరీషను పెళ్లి చేసుకుంటా అని తన వెనుక తిప్పుకున్నాడు , మరో అమ్మయి రాగానే శిరీషను వదిలించుకోవాలనుకున్నాడు. అమ్మాయిల జీవితాలతో ఆటలాడడం ఇతనికి సరదాలా ఉంది. అటువంటి వ్యక్తిని వదిలి పెట్టి కేసు మొత్తం చనిపోయిన ప్రభాకర్ రెడ్డి చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు.  ఈ కేసులో ప్రధాన వ్యక్తి వల్లభనేని రాజీవ్ చౌదరి కాని ఇప్పుడు కేసులో శ్రావణ్ ఏ1 అయ్యాడు. మరో వైపు కేసులో మరో కీలక వ్యక్తి తేజస్వినీ ని వల్లభనేని రాజీవ్ చౌదరి తల్లి  , రాజీవ్ సోదరుడు కలసి బెదిరించారు. ఇక్కడ ఇద్దరు అమ్మాయిల జీవితాలతో వాడు ఆడుకుంటున్నాడు అని చెప్పడానికి వెల్తే మా వాడికి మా కులంలోనే వేరే అమ్మాయితో పెళ్లి చేస్తున్నాం . మీ లాంటి వారు రాజీవ్ కు పనికిరారు అంటు చెప్పారు. ఇదంతా పక్కన పెడితో మరో కీలక విషయం వల్లభనేని రాజీవ్ కు చెందిన ఆర్ జే స్టుడియోలోని రాజీవ్ బెడ్ రూంలో కెమెరాలు ఉన్నాయి. బెడ్ రూంలో కెమెరాలతో ఏమి షూటింగ్ చేశారు. పోలీస్ స్టేషన్ కాని స్టుడియో దగ్గర కాని ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఏమైంది . ఇలాంటి అనేక అంశాలకు సమాదానం దొరకడం లేదు.

కేసులో వల్లభనేని రాజీవ్ చౌదరి అనే వ్యక్తి అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. ఇందులో  తల్లి , సోదరుడు కూడా వాడికి సహకరించారు. ఇద్దరు అమ్మాయిలను మోసం చేసే ప్రయత్నంలో ఇద్దరు వ్యక్తుల మరణానికి కారణం అయ్యాడు అన్న విషయాలపై దృష్టి పెట్టకుండా చని పోయిన ఎస్ ఐ గురించి పుంకాలు పుంకాలుగా కథలు తెరమీదకు తెస్తున్నారు.

నిజంగానే ప్రభాకర్ రెడ్డి ఎవరినైనా బెదిరించి ఉంటే అప్పుడు ఎందుకు ఫిర్యాదు చెయ్యలేదు. ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి మరణం పై ఆయన భార్య ఎత్తిన ప్రశ్నలకు సమాదానం ఏది. పాయింట్ బ్లాంక్ లో కాల్చుకుంటే డెడ్ బాడీ అలాగే ఉంటుందా ? తల వెనుక భాగంలో రక్తం ఎందుకు వచ్చింది..?  పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా ఫుటేజ్ ఏమైంది ? ఇలా అనేక ప్రశ్నలు ఉన్నాయి.

ఈ మెత్తం వ్యవహారంలో ప్రభాకర్ రెడ్డి తప్పులు ఏమైనా ఉండి ఉంటే ఉండోచ్చు కాని ఇక్కడా ఆ చౌదరి గారిని కాపాడే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు. ఆయన వెనుకాల ఎవరున్నారు… రాజీవ్ చౌదరి తల్లి , సోదరులను బయటకు ఎందుకు తీసుకు రావడం లేదు. ఈ కేసులో వారు కూడా పాత్రధారులే.

మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమ్మడి రాష్ట్రం పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఆ సమాజిక వర్గం వ్యక్తులు ఏమి చేసిన కాపాడేందుకు కొందరు రంగంలోకి దిగిపోతారు. ఇందులో బాదాకరమైన విషయం ఏందంటే ఆంద్రా కమ్మోన్ని కాపాడేందుకు చచ్చిపోయిన తెలంగాణ రెడ్డోన్ని బద్నాం చేస్తున్నట్లు కనిపిస్తోంది.


Other News