పటేల్ , పట్వారీ వ్యవస్థ మళ్లీ తెస్తారా … ? రైతు కమిటిలు అగ్రవర్ణాల చేతికేనా .. ?


Telangana -New-31 districs-Map

 

రైతు సమన్వయ సమితుల పేరిట తెలంగాణలో మరో సారి హడావుడి మొదలైంది. రాష్ట్రంలో రైతాంగ సమస్యల పరిష్కారానికి ఇది విప్లవాత్మక నిర్ణయం అంటూ రాష్ట్ర ప్రభూత్వం చెప్పుకుంటోంది. ముఖ్యంగా సెప్టెంబర్ 9 కల్లా కమిటిల ఏర్పాటు చెయ్యాలంటూ మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. ఆగమేఘాల మీద కమిటిల ఏర్పాటుకు పరిపతపిస్తున్న ప్రభుత్వం సామాజిక బాధ్యత మరిచినట్లు కనిపిస్తోంది. కమిటిలలో జనాభా ప్రాతిపధికన రిజర్వేషన్లు ఇచ్చే అంశం ప్రస్థావించలేదు. మొత్తంగా మరో సారి గ్రామీణ వ్యవస్థను 9 శాతం జనాభా కలిగిన అగ్రవర్ణాల చేతుల్లోకి పంపే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తోంది.

 

తెలంగాణ గ్రామాల్లో ఒకప్పుడు పటేల్ , పట్వారీ వ్యవస్థ కొనసాగింది. అగ్రవర్ణ దురహంకారం కొనసాగింది.. ఇప్పుడు కూడా కొంత మేర కొనసాగుతోంది. దానికి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభూత్వ హాయంలో కొంత మేర అడ్డుకట్టపడింది. పటేల్ , పట్వారీ వ్యవస్థలను రద్దు చేశారు. అప్పుడు ఆ నిర్ణయం తీసుకోడానికి ఎన్టీఆర్ కు ఉన్న కారణాలు వేరు. రాజకీయంగా టీడీపీ ఎదగడానికి పటేల్ , పట్వారీలు అడ్డుగా ఉన్నారు. అది ఎలా ఉన్నా ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం కొంత వరకు దళిత , బహుజనులకు ఉపయోగ పడింది. ఇప్పుడిప్పుడే బలపడుతున్నారు. ఇంతలో తెలంగాణ ప్రభూత్వం తీసుకున్న నిర్ణయం మరో కుట్రలా కనిపిస్తోంది. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని మరో సారి నిలబెట్టడానికే అన్నట్లు తెలంగాణ వ్యప్తంగా రైతు సమన్వయ కమిటిల ఏర్పాటుకు తెరతీసినట్లు కనిపిస్తోంది. కమిటిల ఎంపిక అంతా నామినేటెడ్ పద్ధతిన జరుగుతుంది అని చెప్పడమే ఈ అనుమానాలకు కారణం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభూత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం  రాష్ట్రంలో 92 శాతం బహుజన, దళిత , గిరిజన , మైనార్టీలు వర్గాల ప్రజలు ఉన్నారు. మరి రైతు సమన్వ  కమిటిల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకుండా కమిటిలు ఏర్పాటు చెయ్యడం అంటే 92 శాతం ప్రజలను మొసం చెయ్యడమే కాదా …? రైతు సమన్వయ కమిటిల పేరిట 9 శాతం లోపు ఉండే వారికి కమిటిలు అప్పగించే కుట్ర జరుగుతోందన్న అనుమానం సమాన్య జనంలో ఉంది . దీనికి సమాదానం చెప్పాల్సిన బాధ్యత ప్రభూత్వం పై ఉంది.

బహుజన , దళిత , గిరిజన , మైనార్టీలు ఇప్పుడు మేల్కొనక పోతే… గ్రామీణ ప్రాంతాల్లో మరో సారి పెత్తందారి వ్యవస్థ రావడం ఖాయంగా కనిపిస్తోంది.


Other News