బిగ్ బాస్ షో హిందీలో హిట్టే కాని తెలుగులోనే ఫ్లాప్ ? ఇక వివాదాల పైనే ఆశ

 

Jr NTR

 

హిందీలో సూపర్ హిట్ పేరొందిన బిగ్ బాస్ షో తెలుగులో మాత్రం ఫ్లాప్ షోగా మిగిలిపోయోట్లు కనిపిస్తోంది. షో కు వచ్చిన వారిలో ఒక్కరు కూడా పెద్దగా చెప్పుకోదగిన వ్యక్తులు లేక పోవడంతో షో పై ఆసక్తి తగ్గింది. చాలా కాలంగా ఈ షో కోసం స్టార్ మా  భారీ ప్రచారం చేసింది. కాని ఆశించిన స్థాయిలో పార్టిసిపెంట్స్ ని తీసుకురాలేకపోయింది. దీంతో తెలుగు ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారు. దీంతో పోటీ చానళ్లు సంబరం చేసుకుంటున్నాయి. నిజానికి ప్రైమ్ టైమ్ లో ప్రసారం అవుతున్న ఈ షో చాలా కాలంగా పోటీ చానళ్లను కంగారు పెట్టింది. రేటింగ్ లో మా టీవీ ఎక్కడికో పోతుందని భావించారు. కాని బిగ్ బాస్ షో టెక్ ఆఫ్ పేలవంగా ఉండడంతో ఆ చానళ్లు ఊపిరి పీల్చుకున్నాయి.

షో నిర్వహకులు కూడా చాలా అయోమయంలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. బిగ్ బాస్ గదిలో 12 మంది వ్యక్తులు ఉంటారని గతంలో ప్రకటించారు. దానికి సంబందించి ప్రచారం కూడా చేశారు. ప్రోమోల్లో కూడా అదే ప్రస్తావించారు. కాని తీరా కార్యక్రమం ప్రారంభమైయ్యే సమయానికి చూస్తే గదిలోకి 14 మందిని పంపారు. మరి నిర్వహకుల్లోనే ఎందుకింత కన్ఫ్యూజన్ ఉందో అర్దం కాదు.

ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్న బిగ్ బాస్ హౌజ్ లో ఉంటున్న వారిలో ఏడుగురు మహిళలు కాగా ఏడుగురు పురుషులు ఉన్నారు. వారి పేర్లు ఒక్క సారి చూస్తే.

 

అర్చన                               సమీర్

ముమైత్ ఖాన్                       ప్రిన్స్

మధు ప్రియా                        సంపూర్ణేష్ బాబు ( నరసింహ్మాచారీ )

జ్యోతి                                 మహేశ్ కత్తి

కల్పన                               శివ బాలాజీ

కత్తి కార్తిక                            ఆధర్శ్

హరితేజ                              ధన్ రాజ్

వీరిలో కొందరినైతే జూనియర్ ఎన్టీఆర్ పదే పదే చెప్పి ప్రేక్షకులకు పరిచయం చెయ్యాల్సి వచ్చింది. ఆ స్థాయిలో కనీస గుర్తింపు లేని వ్యక్తులను తీసుకొచ్చి ఏమి సాధించాలని అనుకున్నారో అర్ధం కావడం లేదు.

ఇక వివాదాల మీదే ఆశలు … చెప్పకోదగిన వ్యక్తులకు తీసుకురాలేక పోయిన షో నిర్వహకులు .. వివాదాలను నమ్ముకున్నారు. మొత్తంగా ఇప్పుడున్న పార్టిసిపెంట్స్ మద్య గొడవలు పెట్టి తమాషా చూపించి సక్సస్ కావాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

 


Other News