ప్రశ్నా పత్రాల లీకేజీకి సర్కార్ కొత్త భాష్యం, పదో తరగతి పరీక్షల రద్దుకు ససేమిరా

 

kadiyam in assembly
ప్రశ్నా పత్రాల లీకేజీకి తెలంగాణ ప్రభుత్వం కొత్త భాష్యం చెప్పింది. పరీక్ష జరుగుతుండగా ప్రశ్నా పత్రం బయట కనిపిస్తే లీకేజీ కాదట. దాన్ని కేవలం మాల్ ప్రాక్టీస్ గా పరిగణించాలట. అటువంటి పరిస్థితుల్లో తిరిగి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదట. ఈ విషయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , విద్యా శాఖా మంత్రి కడియం శ్రీహరి శుక్రవారం శాసనమండలి నిండు సభలో సెలవిచ్చారు. టెన్త్ పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆయన ప్రకటించారు. లీక్ అవ్వడం అంటే పరీక్ష ప్రారంభానికి ముందే పేపర్ బయటకు రావడం అని ఆయన వివరించారు. అయితే ఇప్పుడు పరీక్ష ప్రారంభమైన తరువాత కొద్ది సేపటికి ప్రశ్నా పత్రాలు వాట్స్ యాప్ లో బయటకి వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. అటువంటి పరిస్థిల్లో దాన్ని ప్రశ్నా పత్రం లీక్ అనరని .. కేవలం మాల్ ప్రాక్టీస్ అంటారని కడియం చెప్పారు. మాల్ ప్రాక్టీస్ జరిగినప్పుడు తిరిగి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని కడియం తేల్చేశారు. ఇప్పటికే నిందితులను గుర్తించి అరెస్ట్ లు కూడా చేసినట్లు చెప్పారు.

మాల్ ప్రాక్టీస్ ఏంది… పేపర్ లీక్ ఏంది… రెండు ఒకటే… రెండిటి వల్ల నష్టపోయేది సామన్య విద్యార్థి కదా అన్న విషయం ప్రభుత్వానికి తెలియదా .. ప్రభుత్వ అసమర్ధతను కప్పి పుచ్చుకోడానికి వంకలు వెతుకుతున్న నేతలు ఇప్పుడు కష్టపడి చదివిన విద్యార్థి నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచిస్తే బెటర్ అన్నది పరీక్షలు నిజాయితీగా రాస్తున్న విద్యార్థుల అభిప్రాయం.


Other News