రైతులకు మరో వరం ప్రకటించిన కేసీఆర్ , వచ్చే ఏడాది నుంచి ఎరువు ఫ్రీ

KCR in Janahitha

ఆకర్షనీయ పథకాలతో ఊపు మీద ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కే . చంద్రశేఖరరావు మరో భారీ పథకాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో రైతులందరికీ 26 లక్షల టన్నుల ఎరువులు ఉచితంగా పంపణీ చేస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచే ఇది అమలవుతుందదన్నారు. అయితే రైతులు ఇక చాలు అనే వరకు ఈ పథకం అమలౌతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతాంగానికి రుణమాఫీ సంపూర్ణం చేసిన సందర్బంగా హైదరాబాద్ లోని జనహితలో రైతులతో సీఎం సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన కేసీఆర్..  రాష్ట్రంలో అమలౌతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆధర్శంగా నిలుస్తాయన్నారు. ఇప్పుడు ఎరువుల పంపిణీకి ప్రభుత్వం చెపట్టబోతున్న పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం పై మరో ఆరు లేదా ఏడు వేల కోట్ల రూపాయలు అధనపు భారం పడుతుందని సీఎం వివరించారు. అయినా దాన్ని భరించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. గ్రమ స్థాయిలో రైతు సంఘాలు ఏర్పాటు చెయ్యాలని సీఎం వ్యవసాయశాఖా అధికారులను ఆదేశించారు. రైతు సంఘాల ద్వారానే ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతాయని వివరించారు. ఒక్కో రైతుకు దాదాపు 20 వేల రూపాయల వరకు ఎరువుల కోసం సాయం అందిచనున్నారు. ఈ సాయం నేరుగా రైతుల ఖాతాల్లోకే చేరే విధంగా ఏర్పాట్లు చెయ్యాలని అధికారులను కోరారు సీఎం.


Other News