పదవ తరగతి ఫలితాలు విడుదల … తగ్గిన ఉత్తిర్ణతా శాతం…

 

SSC results

పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల… 

తగ్గిన ఉత్తీర్ణతా శాతం..

జగిత్యాల ఫస్ట్ , వనపర్తి లాస్ట్ 

జూన్ 5 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ..  

పీజు చెల్లింపుకు మే 18 చివరి తేదీ.

పదవ తరగతి పరీక్షా ఫలితాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. గత ఏడాదితో పొల్చితే 1.4 శాతం ఉత్తీర్ణత తగ్గింది. మొత్తం ఐదు లక్షల 33 వేల 701 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా ఇందులో ఐదు లక్షల 7వేల 938 మంది రెగ్యులర్ విద్యార్థులు మిగత వారు ప్రైవేట్ గా పరీక్షలు రాశారు. రెగ్యూలర్ విద్యార్థుల్లో 84.15 శాతం విద్యార్థులు పాస్ అయ్యారు. ఇది గత సంత్సరంతో పోల్చితే 1.4 శాతం తక్కువ. అయితే ఈ ఏడాది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడం వల్లే కొంత మేర పాస్ పర్సెంటేజీ తగ్గి ఉంటుందని ఉపముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. తమకు ఫలితాల కన్న , విలువలే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

ఫలితాల్లో 97.35 ఉత్తీర్ణతతో  జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో కైవసం చేసుకుంది. 64.81 శాతం ఉత్తీర్ణతతో వనపర్తి జిల్లా చివరి స్థానంలో నిచింది.   రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2005 ప్రభుత్వ పాఠశాల్లో 100 శాతం ఫలితాలు సాధించాయని మంత్రి ప్రకటించారు. అయితే 28 పాఠశాలు సున్నా ఫలితాలు సాధించాయి. అందులో 20 ప్రైవేటు పాఠశాలు కాగా 5 ఎయిడెడ్ , 2 జిల్లా పరిషత్ , ఒకటి ప్రభుత్వ పాఠశాల ఉన్నాయి.

పరీక్షల్లో తప్పిన విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్ సప్లీమెంటరీ పరీక్షలు జూన్ 5 నుంచి నిర్వహిస్తామని కడియం ప్రకటించారు. పరీక్షలు రాయాలనుకున్న విద్యార్థులు ఈ నెల 18లోపు పీజులు చెల్లీంచాలని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో విద్యాప్రమానాలు మరింత పెంచుతామని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.

 

click here for results

http://results.cgg.gov.in

 


Other News