చంద్రబాబు మోచేతి నీళ్ళకోసం దిగజారిన టీటీడిపీ నేతలు

Revanth in Vizag

 

ఉన్న ఊరినీ .. కన్న తల్లీనీ మరచిపోవద్దంటారు… కాని తెలంగాణ టీడీపీ నేతలకు ఆ సెంటిమెంట్ ఏమి లేదు. చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని బద్నాం చెయ్యడానికి కూడా వెనుకాడడం లేదు. ఆంధ్రాబాబు చంద్రబాబు మెప్పు అబద్దాలు చెప్పి , తెలంగాణను బద్నాం చేస్తు ఆంధ్రనేతలకు శునకానందాన్నిస్తున్నారు. వైజాగ్ లో జరిగిన మహానాడు సభలో ఇదే జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అన్నిరకాలుగా అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసిన చంద్రబాబు చివరకు చేత కాకపోవడంతో ఇప్పుడు ఆంధ్రాకు పరిమితం అయ్యాడు. అయినా ఇక్కడ తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు అడుగడుగునా ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. రాష్ట్ర విభజన తరువాత అబద్దాలు చెప్పి ఆంధ్రాలో అధికారం చేపట్టిన చంద్రబాబు సరైనా పాలన అందించ లేక తెలంగాణను బద్నాం చేస్తూ కాలం వెల్లదీస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు తెలంగాణలోని కొందరు టీడీపీ నేతలు కూడా తోడైయ్యారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జరిగే మహనాడు కార్యక్రమంలో మరో సారి తెలంగాణ విషం కక్కారు.

షరా మాములుగానే తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్రా నేతలు ప్రసంగాలు చేస్తుంటే తెలంగాణ టీడీపీ నేతలు చూస్తూ కూర్చున్నారు. అది కామన్ అనుకుంటే టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డీ చంద్రబాబు మెప్పు కోసం దిగజారి ప్రసంగం చేశారు. తెలంగాణలో విద్యుత్ సమస్యలు లేక పోవడానికి కారణం చంద్రబాబు అంటూ అబద్దాలు చెప్పారు. విద్యుత్ లో తెలంగాణకు 56 శాతం , ఆంధ్రాకు 44 శాతం ఇస్తే చంద్రబాబు పోనీలే అని వదిలేసాడంటూ వక్రభాష్యం చెప్పారు. చంద్రబాబు ఈ విషయాన్ని వివాదం చెయ్యకపోవడం వల్లే ఈ రోజు తెలంగాణలో పవర్ కట్ లు లేకుండా ఉన్నాయంటూ ఆంధ్రాబాబు భజన చేశారు.

వాస్తవానికి రాష్ట్ర విభజన సందర్భంలో అప్పటి వినియోగాన్ని బట్టీ విద్యుత్ కేటాయింపులు జరిగాయి. అందుకు అనుగుణంగానే విభజన చట్టంలే స్పష్టమైన వివరణ ఉంది. అప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు. విభజన సందర్భంగా అనుసరించే నియమాలకు అనుగుణంగా జరిగిన ఈ కేటాయింపులను వివాదం చేస్తే చంద్రబాబుకు , టీడీపీకి తెలంగాణలో అనుకూల వాతావరణం వస్తుందని ఆశపడుతున్నట్లున్నారు.

తెలంగాణలో అభివృద్ధి లేదు… సమస్యల వలయంలో చిక్కుకుంది … ఇలాంటి మాటలు ఆంధ్రబాబుకు ఆయన పార్టీ మనుషులకు శునకానందం ఇచ్చారు. మరి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటీ .. ఇక నైనా మరండ్రాబాబు. తెలంగాణలో సమస్యలుంటే ఇక్కడ పోరాడండి. పరిష్కరించడంది. పక్కింటోడి ముందు మన పరువు తియ్యకండి.


Other News