వాట్స్ఆప్ కు ఏమైంది ?

WhatsApp stops working

 

ప్రపంచంలోనే అతిపెద్ద మెబైల్ మెసేజింగ్ ఆప్ నిలిచి పోయింది. ప్రపంచ వ్యప్తంగా అనేక దేశాల్లో వాట్స్ఆప్ సేవలకు అంతరాయం ఏర్పడిందని సమాచారం. శుక్రవారం మద్యాహ్నం 1.40 గంటల నుంచి దాదాపు గంటసేపు ఈ సమస్య వచ్చింది. మెసేజ్ లు రాలేదు, మెసేజ్ లు బయటకు వెళ్లలేదు .  దీంతో వినియోగదారులు కంగారు పడ్డారు. ముఖ్యంగా అను నిత్యం వాట్స్ఆప్ పై ఆధారపడేవారు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సమస్య తలెత్తిన విషయాన్ని వాట్స్ఆప్ నిర్వహకులు ఆప్ లో ఉంచారు. సిస్టమ్ స్టేటస్ చూసిన వారికి మెసేజ్ కనిపించింది. అయితే ఒక్క సారిగా ఈ సేవలు నిలచిపోవడంతో ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా  ఈ విషయం హాట్ టాపిక్ అయింది. వాట్స్ఆప్ నిర్వహకులు సమస్యను కొన్ని నిమిషాల్లోనే పరిష్కరించామని చెబుతున్నారు. కాని హైదరాబాద్ లో ఈ సేవలు దాదాపు గంటవరకు నిలిచిపోయాయని వినియోగదారులు చెబుతున్నారు.

ఇటీవలే వాట్స్ఆప్ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా డెస్క్ టాప్ అప్లికేషన్ , మెసేజ్ డిలేట్ లాంటి కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ కొత్త సేవలతో మరింత ఆధరణ పొందుతున్న వేళ ఇలా జరగడం వినియోగదారులను అయోమయానికి గురిచేసింది.  ఏది ఏమైనా సమస్య తొందరగానే పరిష్కారం కావడంతో వినియోగదారులు హ్యాపీగా ఉన్నారు.

 


Other News