బ్రహ్మ ముహూర్తంలో ‘హాజీ బాబా దర్గా’కు పోతరా ? విక్రం గౌడ్ కేసులో పది ప్రశ్నలు..  

Vikram and Shipali

 

గ్రేట్ తెలంగాణ , జులై 28 : తిరుపతి పోవడానికి సౌదీ విమానం ఎక్కిన అని చెబితే ఎలా ఉంటుంది. మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ కేసులో అలాగే ఉంది.  విక్రం భార్య శిపాలి ఇచ్చిన ఫిర్యాదులో కాని ఆమె , ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్న మాటల్లో కాని ఎక్కడా పొంతన లేకుండా పోయింది. సాధారణ పౌరుడు అయి ఉంటే ఇప్పటికే పోలీసులు అన్ని చెప్పించి ఉండే వారు కాని మాజీ మంత్రి కుటుంబం , ధనవంతులు కావడంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజున దర్గకు పోవాలి అనుకున్నం అంటే అవన్ని రాసుకుంటున్నారు పోలీసులు.

వాస్తవానికి హైదరాబాద్ లో మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ తనయుడు విక్రం గౌడ్ కాల్పుల్లో గాయపడడం సంచలనం సృష్టించింది. శ్రుక్రవారం తెల్లవారుజామున 3.20 ప్రాంతంలో ఆయన ఇంట్లో కాల్పులు జరిగాయి. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారని విక్రం భార్య శిపాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తిని తాను చూడలేదని ఎవరో కాల్పులు జరిపినట్లు తన భర్త చెప్పాడని ఆమె వివరించారు. తాను 108 కు కాల్ చేశానని అయితే రెస్పాన్స్ రాలేదని ఆమె పేర్కొన్నారు. ఇవన్ని నిర్ధారించుకోడానికి విక్రంను పోలీసులు అడిగితే మాత్రం అతను మౌనం దాల్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రం ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉంది ఆయన మాట్లాడుతున్నరని సమాచారం కాని కేసు గురించి మాత్రం చెప్పడం లేదు. ఇందులో ప్రధానంగా పోలీసులను వేధిస్తున్న 10  ప్రశ్నలు.

  1. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం దర్గకు ఎందుకు పోవాలని అనుకున్నారు.
  2. బ్రహ్మముహూర్తంలో దర్గలో పూజలు చేస్తారా… ?
  3. దర్గలో అన్నదానం చెయ్యాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి … ఎందుకు తీసుకోలేదు.?
  4. ఇంట్లో సీసీ కెమెరాలు ఎందుకు పని చెయ్యడం లేదు ?
  5. రక్తం మరకలు తుడిచేసే ప్రయత్నం ఎందుకు చేశారు ?
  6. డ్రగ్స్ కేసుపై విక్రం ఆసక్తి ఎందుకు చూపించాడు.. ప్రతి వార్తను భార్యకు ఎందుకు పంపాడు.. ?
  7. అప్పుల్లో కూరుకు పోయాడా ? తండ్రి ముఖేశ్ ఇచ్చిన ఇంటిని ఇటీవలే అమ్మెశాడు… ఎందుకు ?
  8. ఎంత మందికి బాకీ పడ్డాడు.. ? ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంది ..?
  9. 108 కి కాల్ చేస్తే స్పందన లేదు అన్నారు.. మరి పోలీసులకు ఎందుకు కాల్ చెయ్యలేదు.. ?
  10. విక్రం అర్థరాత్రి వరకు ఎక్కడున్నాడు… వచ్చేప్పుడు ఎవరైనా వచ్చారా ..

 

విక్రం గౌడ్ నోరు విప్పితే నే ఈ కేసు చిక్కు ముడి విడేలా లేదు. ముఖ్యంగా ఇది హైదరాబాద్ ఇమేజీకి సంబంధించిన విషయం. ఫిలింనగర్ లాంటి ఏరియాలో ఇలా ఎవరో కాల్పులు జరిపి పారిపోయే అవకాశం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ లో చాలా చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. అంత ఈజీగా ఎవరో కాల్పులు జరిపి పారిపోయే అవకాశం లేదు. కాని ఈ విషయంలో విక్రం అసలు విషయం చెప్పే వరకు స్పష్టత వచ్చేట్టు లేదు.


Other News