బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు ఎందుకివ్వరూ  …? బీసీల కోసం నింగీ , నేల ఎకం చెయ్యాల్సి అవసరం లేదా .. ?

CM KCR with BCs

 

సీఎం కేసీఆర్ అసేంబ్లీ , కౌన్సిల్ వేధికగా రాష్ట్రంలో అట్టడుగు వర్గాల గురించి అద్భుతంగా మాట్లాడారు. ముఖ్యంగా రాష్ట్రంలో 90 శాతం పైగా అట్టడుగు వర్గాలు ఉన్నాయని ఆయన అంగీకరించారు. అయితే జనాభా ప్రాతిపధికన రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వోద్దు అని కేంద్రాన్ని ప్రశ్నించారు. రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం రాష్ట్రాలకే ఇవ్వాలని కేసీఆర్ డిమండ్ చేశారు.  ముస్లీంలకు , ఎస్టీలకు 12 శాతం చొప్పున రిజర్వేషన్లు సాధించుకునేందుకు అవసరం అయితే భూమి , ఆకాశం ఏకం చేస్తానని ప్రకటించారు. కాని బీసీలకు రిజర్వేషన్లు పెంచడం పై చిత్తశుద్ధి కనబర్చలేదు.

మరి సీఎంకు బీసీల వెనుకబాటు తనం ఎందుకు గుర్తుకు రావడం లేదు. బీసీలకు కూడా రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంటుందని వ్యాఖ్యానించి వదిలేశారు. బీసీల కోసం నింగి , నేల ఏకం చెయ్యాల్సిన అవసరం లేదా … రాష్ట్రంలో 60 శాతానికి పైగా బీసీలు ఉంటారు.  కాని తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ చేయించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 52 శాతం బీసీ జనాభా ఉందని తేల్చారు. కనీసం ప్రభుత్వ లెక్కలు చూసుకున్నా …. రాష్ట్రంలో సగానికి పైగా బీసీలు ఉన్నారు. కాని చట్టసభల్లో,  రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నామినేటెడ్ పదవుల్లో , విధ్యా , ఉపాధి అవకాశాల్లో  అన్నింటా అన్యాయమే జరుగుతోంది.  కేసీఆర్ చెప్పిన లెక్క ప్రకారమే 90 శాతం  ఉన్న బడుగు , బలహీణ వర్గాల ప్రజలను పక్కన పెట్టి 10 శాతం లోపు ఉండే వర్గాలు పాలకులుగా చలామనీ అవుతున్నారు. 90 శాతం ఉన్న వర్గాలకు  అవకాశాలు అందకుండా చేస్తున్నారని స్పష్టం అవుతోంది.

ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం చూసుకుంటే రాష్ట్ర జనాభాలో ముస్లీంలు 11 శాతం , ఎస్టీలు 9.8 శాతం అయినా ముస్లీంలు , ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇప్పంచడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంది. మరి వారికి వారి జనాభా కన్నా ఎక్కువ రిజర్వేషన్లు కల్పిస్తే రాష్ట్రంలో 52 శాతం పైన ఉన్నబీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. ముస్లీంలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం పదే పదే కేసీఆర్ తమిళనాడును ప్రస్తావిస్తున్నారు. అక్కడ నిర్ణీత శాతాన్ని మించి రిజర్వేషన్లు కల్పించారు. అది ఆయుధంగా చేసుకొని ఇక్కడ ముస్లీంలు , ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది సీఎం అభిప్రాయం మరి అదే చిత్తశుద్ధి బీసీల గురించి ఎందుకు లేదు.

ప్రభుత్వం ఈ అంశాలు లేవనెత్తగానే ముస్లీం , ఎస్టీ రిజర్వేషన్లు ఆపాల్సిన అవసరం లేదు. బీసీలకు కూడా రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచేందుకు కృషి చెయ్యాలి.


Other News