“కిస్ ఆఫ్ లవ్” ముద్దు … వర్మ జీఎస్టీ వద్దా …?

 

Kiss of love and GST

ఓడలు బండ్లు … బండ్లు ఓడలు అవ్వడం అంటే ఎంటో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. లవర్స్ డే వద్దంటే అన్యాయం..  కిస్ ఆఫ్ లవ్ కార్యాక్రమాలు అడ్డుకుంటే అక్రమం … అంటూ గొడవ చేసిన వారే ఇప్పుడు పక్కా సాంప్రదాయవాదులుగా మారి పోయారు. భారత దేశ సంస్కృతీ సాంప్రదాయాలు అంటూ లెక్చర్లు ఇస్తున్నారు. ప్రభూత్వం వెంటనే చర్యలు తీసుకోవాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్నారు. మొత్తంగా లెఫ్ట్ – రైట్ ఆలోచనా విధానాలు ఒక్కటైయ్యాయి. మరి ఇంతకీ వీరిని ఒకే దారిలోకి తెచ్చింది ఎంవరో తెలుసా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.

వర్మ తీసిన జీఎస్టీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో లెఫ్ట్ , రైట్ మహిళా సంఘాలను కలిపింది. ఉమ్మడిగా ఉద్యమాలు చేసేలా చేసింది. పోర్న స్టార్ మియా మాల్కోవాతో వర్మ తీసిన జీఎస్టీ సినిమా దీనికి ప్రధాన కారణం.  ప్రస్తుత సమాజం పై ఈ తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నది వారి వాదన. భావోద్వేగాలను రెచ్చగొట్టే సినిమాలు తీసి డబ్బులు సంపాదించుకున్న వర్మ ఇప్పుడు  క్రియేటివిటీ పేరుతో బ్లూ ఫిర్మ్ తీస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. దానికి తోడు టీవీ చానల్స్ లో కూర్చొని మహిళలను అవమాన పరిచేవిధంగా వర్మ చేసిన కామెంట్స్ పై మహిళలు సీరియస్ అయ్యారు. హైదరాబాద్ లోని సీసీఎస్ లో వర్మపై  కేసు నమోదు అయింది. ఇప్పటికే శనివారం దాదాపు నాలుగు గంటలు విచారించిన పోలీసులు వర్మ మొబైల్ ఫోన్ , ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. మరో సారి ఫిబ్రవరి 19న విచారణకు రావాలని ఆదేశించారు.

ఇదంతా ఎలా ఉన్నా గతంలో విదేశి సంస్కృతిని ప్రోత్సహించి.. వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపై విమర్శలు చేసిన వారు ఇప్పుడు వర్మ తీస్తున్న సినిమాను వ్యతిరేకించడం విశేషం. ముఖ్యంగా రాష్ట్రంలోని కొన్ని మహిళా సంఘాలు చాలా సందర్భాల్లో వివాదాస్పదంగా వ్యవహరించాయి. దేశ వ్యాప్తంగా లవర్స్ డే అతి పెద్ద సమస్యగా మారింది. తెలిసీ తెలియని వయస్సులోనే పిల్లలు ప్రేమ పేరుతో వాలెంటైన్ డే అంటూ రోడ్లపై చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ … ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. దాన్ని కొన్ని సంస్థలు అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇదే మహిళా సంఘాల నేతలు అలా ఎలా అడ్డుకుంటారంటూ కామెంట్స్ చేశారు.  మరో సందర్భంలో 2014 సంవత్సరంలో కెరళాలో ఓ ప్రేమ జంట బహిరంగంగా ముద్దులు పెట్టుకుంటుంటే సాంప్రదాయ సంఘాల ముసుగులో కొందరు దాడులు చేశారు. దీన్ని కొన్ని సంఘాలు పెద్ద సంచలనం గా మార్చాయి. దేశ వ్యాప్తంగా చర్చ చెయ్యాలనే క్రమంలో “కిస్ ఆఫ్ లవ్” అంటూ హాంగామా చేశాయి. ఆ సందర్బంలో హైదరాబాద్ లోని ప్రఖ్యాత యూనివర్సిటీలో కిస్ ఆఫ్ లవ్ అంటూ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సందర్భంలో ఎవరు ఎవర్ని, ఎందుకు  ముద్దులు పెట్టుకుంటున్నారో  కూడా తెలియనంత ఘోరంగా వ్యవహరించారు. వీటన్నింటిని మహిళా సంఘాల నేతలు కొందరు సమర్ధించారు. పైగా వారికి స్వేచ్ఛ ఇవ్వారా అని ప్రశ్నించారు. మీరు మోరల్ పోలీసింగ్ చేస్తారా అంటూ నిలదీశారు. ఇలాంటి అనేక అంశాలపై కొన్ని సంఘాల మధ్య మాటల యుద్దాలు జరిగాయి.

కాని ఇప్పుడు ఆ రెండు వర్గాలు రాంగోపాల్ వర్మ తీసిన జీఎస్టీ చిత్రాన్ని విమర్శిస్తున్నాయి. ఆయన మీద కేసు పెట్టాయి. ఈ సమాజంలో కొన్ని సాంప్రదాయాలు , కట్టుబాట్లు ఉన్నాయని తెలుసుకో అంటూ హితువు చెప్పారు. వర్మ మహిళ శరీరం పై వ్యాపారం చెయ్యాలని చూస్తున్నాడంటూ ఆరోపిచారు.

కాక పోతే అమ్మాయిలు సంగం బట్టలు వేసుకొని విచ్చల విడిగా తిరగడం … “కిస్ ఆఫ్ లవ్” పేరిట ముద్దులు పెట్టుకోవడం … వాలెంటైన్ డే పేరిట పార్కుల్లో బహిరంగంగా శృంగారం చెయ్యడం… అన్ని రాజ్యంగం కల్పించిన స్వేచ్ఛలో భాగం అని వాదించిన వారే ఇప్పుడు వర్మ సినిమాను వ్యతిరేకిస్తున్నారు. మరి   ఈ సినిమా విషయంలో కూడా రాంగోపాల్ వర్మకు , మియా మాల్కోవాకు స్వేచ్ఛ ఉంటుంది కదా …ఈ సినిమాకు వ్యతికేకంగా మాట్లాడ్డం అంటే ఈ సంఘాల వారిది కూడా మోరల్ పోలీసింగ్ కాదా… ఇలాంటి సైటైర్లు వారిపై వచ్చే అవకాశం ఉంది.

ఏది ఏమైనా కనీసం ఈ సందర్భంగా అయినా మహిళా సంఘాలంతా ఒకే మాట మీదకు వచ్చినందుకు అభినందించాలి. ముఖ్యంగా ప్రజల భావోద్వేగాలతో రెచ్చగొట్టి , సంస్కృతిని నశనం చేసి యువత మెదళ్లలో విషం నింపేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఆగాలి. అది “కిస్ ఆప్ లవ్” కావచ్చు , వాలెంటైన్ డే వావచ్చు , జీఎస్టీ సినిమా కావచ్చు. వీటిని అడ్డుకొని భవిష్యత్తు సారధులైన యువకులను సన్మార్గంలో నడపాల్సిన అవసరం ఉంది.

 

“కిస్ ఆప్ లవ్” పేరిట గతంలో హైదరాబాద్ లో జరిగిన హంగామా కింద లింక్ లో చూడొచ్చు.

https://www.youtube.com/watch?v=oKhbq880nQU

 


Other News